భారతీయ కుబేరుడు మళ్లీ ముకేశే
-అదానీని వెనక్కి నెట్టిన అంబానీ -హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఎఫెక్ట్ విధాత: భారతీయ అపర కుబేరుడిగా మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అవతరించారు. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ఆసియా, ఇండియాల్లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అమెరికా ఇన్వెస్టింగ్ పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ సంస్థల షేర్లు స్టాక్ మార్కెట్లలో కుప్పకూలుతున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే అదానీ సంపద కరిగిపోతుండగా, అంబానీ ముందుకొచ్చారు. ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ […]

-అదానీని వెనక్కి నెట్టిన అంబానీ
-హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఎఫెక్ట్
విధాత: భారతీయ అపర కుబేరుడిగా మళ్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అవతరించారు. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ఆసియా, ఇండియాల్లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అమెరికా ఇన్వెస్టింగ్ పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ సంస్థల షేర్లు స్టాక్ మార్కెట్లలో కుప్పకూలుతున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే అదానీ సంపద కరిగిపోతుండగా, అంబానీ ముందుకొచ్చారు.
ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ జాబితా ప్రకారం 84.3 బిలియన్ డాలర్లతో ముకేశ్ అంబానీ వరల్డ్ టాప్-10 శ్రీమంతుల్లో 9వ స్థానంలో ఉన్నారు. 84.1 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ 10వ స్థానానికి పడిపోయారు. హిండెన్‌బర్గ్ రిపోర్టుకు ముందు అదానీ టాప్-3లో ఉన్న సంగతి విదితమే.
అయితే అదానీ గ్రూప్ సంస్థల్లో అవకతవకలు జరిగాయన్న వార్తలతో మదుపరులు ఒక్కసారిగా ఈ షేర్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మొదలుపెట్టారు. ఫలితంగా ఈ నాలుగైదు రోజుల్లో అదానీ ఆస్తుల విలువ లక్షల కోట్ల రూపాయల్లో హరించుకుపోయింది. అధిక రుణాలు, సంస్థల విలువ భారీగా చూపడం తదితర అక్రమాలకు అదానీ గ్రూప్ తెగబడిందని హిండెన్‌బర్గ్ చెప్తున్నది.