గర్జించిన రాయలసీమ.. కర్నూలు సభకు పోటెత్తిన జనం.. ఇక బాబు చిత్తేనా!
విధాత: మూడు రాజధానుల విధానానికి ప్రజా మద్దతు కూడగట్టేందుకు వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. విశాఖలో పాలనా రాజధాని కావాలంటూ ఆ మధ్య ఉత్తరాంధ్ర గర్జన విశాఖలో నిర్వహించిన వైస్సార్సీపీ ఇప్పుడు హైకోర్టు మాకే కావాలంటూ కర్నూలులో గర్జించింది. అప్పట్లో ఏకంగా విశాలాంధ్ర రాజధాని కర్నూలులో ఉండేదని కానీ ఆంధ్రప్రదేశ్ కోసం రాజధానిని వదులుకుని హైదరాబాదుకు త్యాగం చేశాం, ఇప్పుడు మాత్రం పట్టు వీడేది లేదని సీమ జేఏసీ నాయకులు స్పష్టం చెప్తున్నారు. త్యాగం అంటే శ్రీశైలం […]

విధాత: మూడు రాజధానుల విధానానికి ప్రజా మద్దతు కూడగట్టేందుకు వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. విశాఖలో పాలనా రాజధాని కావాలంటూ ఆ మధ్య ఉత్తరాంధ్ర గర్జన విశాఖలో నిర్వహించిన వైస్సార్సీపీ ఇప్పుడు హైకోర్టు మాకే కావాలంటూ కర్నూలులో గర్జించింది. అప్పట్లో ఏకంగా విశాలాంధ్ర రాజధాని కర్నూలులో ఉండేదని కానీ ఆంధ్రప్రదేశ్ కోసం రాజధానిని వదులుకుని హైదరాబాదుకు త్యాగం చేశాం, ఇప్పుడు మాత్రం పట్టు వీడేది లేదని సీమ జేఏసీ నాయకులు స్పష్టం చెప్తున్నారు.
త్యాగం అంటే శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులది.!#RayalaseemaGarjana #AndhraNeeds3Capitals pic.twitter.com/cuXX2MwSSo
— Dhanisvith (@Dhanisvith) December 5, 2022
దీనికి మద్దతుగా నిలిచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వారు సైతం శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాల్సిందే అని, హైకోర్టు కర్నూలులో పెట్టాల్సిందే అని అంటున్నారు. మొత్తానికి ఇది రాజకీయా సమావేశాన్ని తలపించినా భారీగా జనం హాజరై కర్నూలుకు తమ మద్దతు తెలిపారు. దీంతో టీడీపీ ఇరుకున పడినట్లు అయింది. సీమ అభివృద్ధి వద్దా.. అంతా అమరావతిలోనే ఉండాలా అంటూ సీమ ప్రజలు, యువత, వైసీపీ నాయకులు వేస్తున్న ప్రశ్నలకు టీడీపీ వారి వద్ద సమాధానాలు లేకపోయాయి.
చంద్రబాబు తనకు తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి.#RayalaseemaGarjana #APNeeds3Capitals pic.twitter.com/hADpAxXe01
— YSR Congress Party (@YSRCParty) December 5, 2022
యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ రకరకాల జీవోల పేరిట రాయలసీమ పొట్టగొట్టింది చంద్రబాబే అని ఆరోపించారు. జీవో నంబర్ 69 తెచ్చి రాయలసీమ రైతాంగానికి, జోవో నంబర్ 120 తెచ్చి రాయల సీమ విద్యార్ధులను నిండా ముంచేసింది చంద్రబాబే అని ధ్వజమెత్తారు. అనంతపురానికి AIIMSను కేంద్రమిస్తే దానిని మంగళగిరికి తరలించి అనంతపురానికి ద్రోహం చేసింది కూడా ఆయనే తెలిపారు. అందుకే 2019 ఎన్నికల్లో రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే 49 స్థానాల్లో టీడీపీని చిత్తుగా ఓడించారు. కేవలం 3 స్దానాల్లోనే టీడీపీ గెలిచిందన్నారు.
చంద్రబాబు రాయలసీమ ద్రోహి. #RayalaseemaGarjana #APNeeds3Capitals pic.twitter.com/jOCeVI83HZ
— YSR Congress Party (@YSRCParty) December 5, 2022
మొన్న కర్నూలులో బాబు రెచ్చగొట్టిన ప్రసంగాల వలన ఈసారి ఆ మూడింట్లో కూడా టీడీపీని సీమ జనం చిత్తుగా ఓడిస్తారు” అంటూ సిద్ధార్థ్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ ‘సీమ’ అత్యంత వెనుకబడిన ప్రాంతం. దీనికి న్యాయం చేసేందుకు హైకోర్టు ఏర్పాటు చేయాలని పెద్దమనుషులు 1937లో ఒప్పందం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కాంక్షిస్తూ ముఖ్యమంత్రి హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ కొందరు కుట్రలు చేస్తున్నారు. అది ఎవరో అందరికీ తెలుసు.
ఒరేయ్ బొల్లిలుచ్చా నువు సీమ బిడ్డవేనా లేక ఎవడన్నా వచ్చి వేసిన విత్తనానివా? లేకుండా సీమ మీద ఇంత అక్కసు ఎందుకురా మై బొల్లి ప్రెండ్.#RayalaseemaGarjana #ApNeeds3Capitals pic.twitter.com/EhB9AkD5tK
— జర్నలిస్టు మీసాలనాయుడు (@misalanayudu) December 5, 2022
ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చి చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అందుకే జేఎసీ నేతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నా. కచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం జరగాలి.” అన్నారు. మొత్తానికి సీమ అభివృద్ధికి చంద్రబాబే అడ్డంకి అనేలా మెసేజీని ప్రజల్లోకి పంపే లక్ష్యంతో జరిగిన ఈ గర్జనలో భారీగా యువత, విద్యావంతులు పాల్గొన్నారు. జేఏసీ పేరిట ఈ కార్యక్రమం జరిగినా తెరవెనుక అన్నిరకాల సహకారాలూ ప్రభుత్వం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందించాయి.
Rayalaseema Garjana Drone Visuals