Site icon vidhaatha

Rohit Sharma: సీఎం ఫడ్నవిస్ తో రోహిత్ శర్మ భేటీ!

Rohit Sharma:  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కలిశారు. ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రోహిత్ శర్మ సీఎం ఫడ్నవిస్ కలవడం చర్చనీయాంశమైంది. సీఎం అధికారిక నివాసం అయిన వర్షకు వచ్చిన రోహిత్ సీఎం ఫడ్నవిస్ ను కలిశారు. దీంతో రోహిత్ శర్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. టీ 20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డే ఫార్మట్ లో కొనసాగుతున్నారు. 2027వన్డే వరల్డ్ కప్ ఆడుతారని భావిస్తున్న క్రమంలో ఆయన సీఎం ఫడ్నవిస్ ను కలవడం ఆసక్తిరేపింది. దీంతో రోహిత్ శర్మ తన సెకండ్ ఇన్నింగ్స్ ను రాజకీయాల్లో కొనసాగించబోతున్నాడా అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.

రాజకీయల్లోకి వస్తే రోహత్ బీజేపీలో చేరబోతున్నారా..అందుకే సీఎం ఫడ్నవిస్ తో ఆయన భేటీ అయ్యారా అన్న చర్చ సాగుతోంది. టీమిండియా క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చే పరంపర కొనసాగుతోంది. గౌతమ్ గంభీర్ బీజేపీలో ఎంపీగా వ్యవహరించారు. నవజ్యోత్ సింగ్ సిద్దూ సైతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.

Exit mobile version