RRR
విధాత: ప్రస్తుతం మన దేశంలో అర్థ శతదినోత్సవాలు లేవు. ఇక శతదినోత్సవాలు, గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ చిత్రాలు కనుమరుగై చాలా కాలం అయింది. నేటి రోజుల్లో ఓ బ్లాక్ బస్టర్ చిత్రం నెల రోజులు థియేటర్లలో ఆడటం అంటే గొప్ప. నెలరోజులు కూడా థియేటర్లలో ఆడటం అంటే గగనమైపోయింది. మొదటి వారంలోని సాధ్యమైనంత ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే మరో రెండు మూడు వారాలు అంతే. ఆ తరువాత థియేటర్ల నుంచి వెళ్ళిపోతున్నాయి.
సూపర్ హిట్ సినిమాలు కూడా నాలుగు వారాలు థియేటర్లో ఉండటం కష్టమైంది. 50 రోజులు ఆడుతున్న సినిమాలు ఎప్పుడో పోయాయి. అలాంటిది RRR సినిమా వంద రోజులు పూర్తి చేసుకొని శత దినోత్సవం జరుపుకోవడం అందునా అది కూడా జపాన్‌లో కావడం మరో అద్భుతం.
Love you Japan… Team #RRR thanks you for continuing to shower #RRRMovie with your love and support