విధాత: ఎంత పెద్ద వారికైనా గొప్ప వారికైనా ఒక ఫ్యాన్ అంటూ ఒకరు ఉంటారు. వారిని కొలుస్తూ వారి స్థాయికి ఎదగాలని నిరంతరం వారి నుంచి స్ఫూర్తి పొందుతూ కష్టపడుతూ ఉంటారు. ప్రధాన మంత్రుల కైనా సరే వేరేవరో ఇన్స్పిరేషన్ కచ్చితంగా ఉంటుంది. చివరకు అబ్దుల్ కలాంకు కూడా స్ఫూర్తినిచ్చిన ఓ స్నేహితుని గురించి ఆయన చెప్పుకొచ్చారు.
ఇక విషయాన్ని వస్తే ఇండియాలో ప్రస్తుతం రాజమౌళి మేనియా నడుస్తోంది. ఆయన దర్శకునిగా మారినప్పటి నుంచి అపజయమన్నదే ఎరుగకుండా ముందుకు సాగుతున్నారు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2లతో పాటు RRRకు వచ్చిన ఘనత మరోవైపు. RRR చిత్రం దేశవ్యాప్తంగా థియేటర్లలో ప్రభంజనం సృష్టించింది.
కానీ ఏ ముహూర్తాన ఇది ఓటిటిలో విడుదల అయిందో గాని నాటి నుంచి నేటివరకు హాలీవుడ్ నుంచి పలు దేశాల సినీ దిగ్గజాలు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభను కీరవాణి సంగీత మహత్యాన్ని రామ్ చరణ్ ఎన్టీఆర్ ల అత్యద్భుత నటనను నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అనేలా అంబరాన్ని చుంబించేలా తమ పొగడ్తలు వారిపై కురిపిస్తున్నారు.
అలాంటి దర్శకధీరుడు రాజమౌళికి ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ అంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం రాజమౌళితో పాటు కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో స్పీల్ బర్గ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి ఆయనతో కాసేపు ముచ్చటించారు.
I just met GOD!!! ❤️