రిజర్వేషన్లను అనుభవిస్తూ.. వేల కోట్లు సంపాదించిన చరిత్ర RS ప్రవీణ్ కుమార్‌ది: చిరుమర్తి

విధాత: నకిరేకల్, నల్గొండ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు మూసీ, బిక్కేరు వాగుల ఇసుక దందాతో 3500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు, వాటిలో ప్రగతిభవన్ కు వాటా ఉందంటూ బీఎస్పీ అధినేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు అవాస్తమంటూ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. ఆదివారం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణల పై మేము బహిరంగ చర్చకు సిద్ధమని లింగయ్య సవాల్ విసిరారు. సిబిఐ ఎసిబిలతో ఎలాంటి విచారణలకైనా సిద్ధమన్నారు. అక్రమ […]

  • Publish Date - February 26, 2023 / 11:16 AM IST

విధాత: నకిరేకల్, నల్గొండ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు మూసీ, బిక్కేరు వాగుల ఇసుక దందాతో 3500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు, వాటిలో ప్రగతిభవన్ కు వాటా ఉందంటూ బీఎస్పీ అధినేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు అవాస్తమంటూ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు.

ఆదివారం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణల పై మేము బహిరంగ చర్చకు సిద్ధమని లింగయ్య సవాల్ విసిరారు. సిబిఐ ఎసిబిలతో ఎలాంటి విచారణలకైనా సిద్ధమన్నారు. అక్రమ సంపాదన చేసినట్లు రుజువు చేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.

రాజకీయ మనుగడ కోసమే దళిత యువకులను ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ రెచ్చగొడుతున్నారన్నారు. విద్యావంతుడు సీనియర్ అధికారి అయి ఉండి కూడా నిజనిర్ధారణ లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగి పేరుతో అక్రమంగా వేల కోట్లు సంపాదించిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే సొంతమన్నారు.

మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లను అనుభవిస్తూ ప్రభుత్వ సొమ్మును దోచుకున్న చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దేనని విమర్శించారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్న దళిత సమాజంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలజడులను సృష్టిస్తున్నారని, స్వలాభం కోసమే దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.