Russian oil | రష్యా చమురు.. వయా ఇండియా

విధాత: భారత దేశం రష్యా (Russian oil) నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురును.. శుద్ధి చేసిన చమురు పేరిట యూరోపియన్‌ యూనియన్‌కు అమ్ముతున్నదని ఈయూ చీఫ్‌ దౌత్యవేత్త జోసెఫ్‌ బారెల్‌ ఆక్షేపించారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ఆయన ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు చెప్పారు. భారతీయ చమురు శుద్ధి కంపెనీలు పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని అటు నుంచి యూరోపియన్‌ యూనియన్‌కు తరలిస్తున్నాయని బారెల్‌ అన్నారు. రష్యా చమురు దిగుమతిపై ఉన్న ఆంక్షలను తప్పించుకోవడానికి ఈ […]

  • By: Somu |    latest |    Published on : May 16, 2023 2:41 PM IST
Russian oil | రష్యా చమురు.. వయా ఇండియా

విధాత: భారత దేశం రష్యా (Russian oil) నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురును.. శుద్ధి చేసిన చమురు పేరిట యూరోపియన్‌ యూనియన్‌కు అమ్ముతున్నదని ఈయూ చీఫ్‌ దౌత్యవేత్త జోసెఫ్‌ బారెల్‌ ఆక్షేపించారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ఆయన ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు చెప్పారు.

భారతీయ చమురు శుద్ధి కంపెనీలు పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని అటు నుంచి యూరోపియన్‌ యూనియన్‌కు తరలిస్తున్నాయని బారెల్‌ అన్నారు. రష్యా చమురు దిగుమతిపై ఉన్న ఆంక్షలను తప్పించుకోవడానికి ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయని ఆయన అన్నారు.

ఇందులో డీజిల్‌ ఎగుమతులు కూడా ఉన్నట్టు ఆయన అన్నారు. రష్యా తక్కువ ధరకు అమ్మవచ్చు. ఇండియా కొనవచ్చు. అది వారిరువురి పరస్పర ప్రయోజనం. కానీ అదే చమురు యూరోపియన్‌ యూనియన్‌కు అమ్మడం అంటే ఆంక్షలను వమ్ము చేయడమే అని ఆయన అన్నారు