Samantha | స‌మంత కొత్త బాయ్‌ఫ్రెండ్ ఇత‌డేనా.. నాగ చైత‌న్య‌ని మించి ఉన్నాడుగా..!

Samantha | అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత ఇప్పుడు త‌న ఫోక‌స్ మొత్తం కెరీర్, ఆరోగ్యంపై పెట్టింది. నాగ చైత‌న్య నుండి విడిపోయాక కాస్త డిప్రెష‌న్‌లో ఉన్న స‌మంత ఇప్పుడు తిరిగి మాములు మనిషి అయింది. ఫ్రెండ్స్‌తో క‌లిసి తెగ సంద‌డి చేస్తుంది. ఇటీవ‌ల ఇండోనేషియాకి వెళ్లి వ‌చ్చిన స‌మంత రీసెంట్‌గా త‌న త‌ల్లితో క‌లిసి అమెరికా వెళ్లారు. న్యూయార్క్ లో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌క‌లో కూడా పాల్గొని సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారింది. ఇక […]

  • Publish Date - August 23, 2023 / 10:33 AM IST

Samantha |

అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత ఇప్పుడు త‌న ఫోక‌స్ మొత్తం కెరీర్, ఆరోగ్యంపై పెట్టింది. నాగ చైత‌న్య నుండి విడిపోయాక కాస్త డిప్రెష‌న్‌లో ఉన్న స‌మంత ఇప్పుడు తిరిగి మాములు మనిషి అయింది. ఫ్రెండ్స్‌తో క‌లిసి తెగ సంద‌డి చేస్తుంది. ఇటీవ‌ల ఇండోనేషియాకి వెళ్లి వ‌చ్చిన స‌మంత రీసెంట్‌గా త‌న త‌ల్లితో క‌లిసి అమెరికా వెళ్లారు.

న్యూయార్క్ లో జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌క‌లో కూడా పాల్గొని సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారింది. ఇక అమెరికా వెళ్లిన‌ప్ప‌టి నుండి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తుంది స‌మంత‌. అయితే ఏ దేశం వెళ్లినా, ఏ ప్రాంతం వెళ్లినా కూడా స‌మంత వ్యాయామం చేయడం మాత్రం ఆప‌డం లేదు.

తాజాగా స‌మంత జిమ్‌లో ఓ వ్య‌క్తితో క‌లిసి వ్యాయామం చేస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఇప్పుడు ఈ పిక్ అంద‌రిలో లేని పోని అనుమానాలు క‌లిగిస్తుంది. వ్య‌క్తి ఫేస్ క‌నిపించ‌కుండా స‌మంత పిక్ షేర్ చేయ‌డంతో అత‌ను త‌ప్ప‌కుండా ఆమె కొత్త బాయ్‌ఫ్రెండ్ అయి ఉంటాడ‌ని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

సమంత రెండో పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇత‌నే అని, నాగ చైత‌న్య‌ని మించి ఉన్నాడ‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి స‌మంత షేర్ చేసిన పిక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే స‌మంత ప‌క్క‌న ఉన్న మిస్టరీ వ్యక్తి ఎవరో మనకు తెలియాలంటే సమంత స్పందించాల్సిందే.

నాగ చైత‌న్య నుండి విడిపోయిన సమంత రెండేళ్లుగా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. హీరో నాగ చైతన్యతో విడిపోయాక త‌నఫోక‌స్ మాత్రం కెరీర్‌పైనే పెట్టింది.మ‌ళ్లీ ఎవ‌రిని పెళ్లి చేసుకోని స‌మంత.. సీక్రెట్‌గా ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా అనే అనుమానాలు చాలా మందికి వ‌చ్చాయి.

వాటిని ప‌లు సంద‌ర్భాల‌లో సామ్ కొట్టి ప‌డేసింది. ఇక సమంత-నాగ చైతన్య 2018లో ప్రేమ వివాహం చేసుకోగా, నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం మనస్పర్థల వ‌ల‌న విడిపోయారు. 2021 అక్టోబర్ 2న తామిద్ద‌రం అధికారికంగా విడిపోవాల‌ని భావిస్తున్నామ‌ని చెబుతూ విడాకుల ప్రకటన చేశారు. వారి విడాకుల విష‌యం చాలా మంది హృద‌యాల‌ని గాయ‌ప‌ర‌చింది.