హాష్, షాషా మంచి కంపెనీ ఇస్తున్నాయి: స‌మంత‌

సమంతాను కంటికి రెప్పలా చూసుకుంటుంది ఆ ఇద్దరే….! విధాత‌: కెరీర్ ప్రారంభంలో తనకంటూ తిరుగులేకుండా ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత. వరుసగా బిగ్ యంగ్ స్టార్స్ తో పలు చిత్రాలలో నటించిన ఈమె ఆ తరువాత తన మొదటి చిత్రం హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ వీరికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మరల సమంత సినిమాలలో బిజీ అవుతున్న సమయంలో ఆమెకు మయో సైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి […]

  • Publish Date - January 14, 2023 / 09:12 AM IST

సమంతాను కంటికి రెప్పలా చూసుకుంటుంది ఆ ఇద్దరే….!

విధాత‌: కెరీర్ ప్రారంభంలో తనకంటూ తిరుగులేకుండా ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత. వరుసగా బిగ్ యంగ్ స్టార్స్ తో పలు చిత్రాలలో నటించిన ఈమె ఆ తరువాత తన మొదటి చిత్రం హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ వీరికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మరల సమంత సినిమాలలో బిజీ అవుతున్న సమయంలో ఆమెకు మయో సైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి వచ్చింది. దాని నుంచి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

ఇటీవల ఆమె నటించిన యశోద చిత్రం ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 17న ఆమె నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం శాకుంతలం విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మాణ భాగస్వామిగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ కూడా విడుదలయ్యింది. ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇక సమంత ప్రస్తుతం ఒకప్పుడు నాగచైతన్యతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉంటుంది. ఇది మురళీమోహన్ అపార్ట్మెంట్స్ లో ఉంది. అందులోని పెంట హౌస్ను నాగచైతన్య సమంతలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం అక్కడే సమంత ఉంటుంది. ఈ ఒంటరితనంలో తన వెంట అంగరక్షకులుగా తనని 24 గంటలు కంటికి రెప్పలా కాచుకుని కూర్చుంటున్న ఇద్దరు ఫ్రెండ్స్ గురించి ఆమె చెప్పుకొని వచ్చింది.

ఇందులో ఒకరు హాష్ మరొకరు షా షా. ఈ రెండు పెట్టి డాగ్స్ సమంతాను ఇంట్లో క్షణం కూడా విడిచిపెట్టి ఉండడం లేదు. అవి తనకు బాగా కంపెనీ ఇస్తున్నాయి అంటోంది సమంత. అలసిపోయినా ఏదైనా ఇంకేదైనా కలతతో అలా బెడ్ పై వాలిపోగానే అవి రెండు తనని విడిచిపెట్టి ఎటు వెళ్లడం లేదు. డోంట్ వర్రీ మమ్మీ.. నేను నీ వెనక వస్తున్నాను అని హాష్‌, షాషాలు అంటున్న‌ట్లు ఉంది అని సమంత చెప్పుకొచ్చింది.

ఈ ఫోటోకి సమంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సమంతాకు షాషా, హాష్ అంటే ప్రాణం. ఈ కుక్కపిల్లలే నాగచైతన్య సమంత లవ్ లైఫ్ గురించి హింట్ ఇచ్చాయి. ఇప్పుడు ఇవి పెద్దవయ్యాయి. మొత్తానికి నాగచైతన్యతో విడాకులు, మయోసైటీస్ వ్యాధులతో డిప్రెషన్ లోకి వెళ్లిన సమంతాను ఈ రెండు పెంపుడు కుక్క‌లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయని సమంతా చెప్పుకొచ్చింది.