Mumbai | కుక్కలకు ఆహారంగా సరస్వతి శరీర భాగాలు.!
విధాత: మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) నగరంలో తనతో సహజీవనంలో ఉన్న సరస్వతి వైద్యను మనోజ్ సానే అనే వ్యక్తి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సరస్వతి ఆనవాళ్లను మాయం చేసేందుకు మనోజ్ అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడుతోంది. సరస్వతి శరీర భాగాలను కుక్కలకు ఆహారంగా పెట్టాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్కలకు దూరంగా ఉండే మనోజ్.. గత కొద్ది రోజుల నుంచి […]

విధాత: మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) నగరంలో తనతో సహజీవనంలో ఉన్న సరస్వతి వైద్యను మనోజ్ సానే అనే వ్యక్తి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సరస్వతి ఆనవాళ్లను మాయం చేసేందుకు మనోజ్ అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడుతోంది.
సరస్వతి శరీర భాగాలను కుక్కలకు ఆహారంగా పెట్టాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుక్కలకు దూరంగా ఉండే మనోజ్.. గత కొద్ది రోజుల నుంచి వాటికి ఆహారం పెట్టాడని స్థానికులకు పోలీసులు చెప్పారు. అయితే కుక్కలకు ఆమె శరీర భాగాలనే ఆహారంగా పెట్టాడా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇక మనోజ్ బెడ్రూంలో పెద్ద పెద్ద ప్లాస్టిక్ సంచులు బయటపడ్డాయని, అందులో సరస్వతి శరీర భాగాలు లభ్యమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. చెట్లు నరికే యంత్రాన్ని కూడా బెడ్రూం నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితడు మనోజ్‌పై హత్య, ఆధారాల ధ్వంసం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. మనోజ్‌ను కోర్టులో హాజరుపరచగా, జూన్ 16వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అనుమతించారు.
సరస్వతికి ముగ్గురు తోబుట్టువులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశామన్నారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాక సరస్వతి అవశేషాల్ని ఆమె తోబుట్టువులకు అప్పగిస్తామన్నారు. అయితే సరస్వతిని తాను చంపలేదని, ఆమెనే విషం తాగి ఆత్మహత్య చేసుకుందని మనోజ్ పోలీసులకు తెలిపాడు.
హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారింపబడ్డ తాను.. సరస్వతితో ఎలాంటి శారీరక సంబంధాలు పెట్టుకోలేదని చెప్పాడు. ఆమె తనకు కుమార్తెతో సమానమని పేర్కొన్నారు. జూన్ 3వ తేదీన తాను ఇంటికి వచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుందని, కేసులో ఇరుక్కుంటానన్న భయంతోనే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నానని మనోజ్ తెలిపాడు. కానీ మనోజ్ మాటలు నమ్మేలా లేవు అని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గుడిలో పెళ్లి..
మనోజ్ సానే, సరస్వతి వైద్య కొన్నేండ్ల క్రితం గుడిలో పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కానీ ఈ విషయాన్ని వారిద్దరూ దాచిపెట్టారని పోలీసులు తెలిపారు. ఐటీఐలో శిక్షణ పొందిన మనోజ్‌కు సరైన ఉద్యోగం దొరక్కపోయేసరికి, పదేండ్లుగా ఓ రేషన్ షాపులో పని చేస్తున్నాడు. అక్కడే సరస్వతి పరిచయమైంది. ఆమెకు సేల్స్ పర్సన్‌గా ఉద్యోగం ఇప్పించి సానిహిత్యం పెంచుకున్నాడు. 2016 నుంచి ఇద్దరూ సహజీవనంలో ఉన్నారు.