చిన్నారిపై లైంగిక‌దాడి.. దోషికి 30 ఏడ్ల జైలు

2018లో మధ్యప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో ఏడేండ్ల‌ బాలికపై లైంగిక‌దాడికి పాల్ప‌డిన కేసులో సుప్రీంకోర్టు దోషికి 30 సంవ‌త్స‌రాల‌ జైలు శిక్ష విధించింది

చిన్నారిపై లైంగిక‌దాడి.. దోషికి 30 ఏడ్ల జైలు
  • 2018లో మధ్యప్రదేశ్‌లోని గుడిలో
  • ఏడేండ్ల పాప‌పై నిందితుడి ఘాతుకం
  • క‌ఠిన శిక్ష విధించిన సుప్రీంకోర్టు


విధాత‌: 2018లో మధ్యప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో ఏడేండ్ల‌ బాలికపై లైంగిక‌దాడికి పాల్ప‌డిన కేసులో సుప్రీంకోర్టు దోషికి 30 సంవ‌త్స‌రాల‌ జైలు శిక్ష విధించింది. అత‌డి చర్య అనాగరికమని పేర్కొన్న‌ది. కేసు వివ‌రాల్లోకి వెళితే.. ఏడేండ్ల బాలిక త‌న అమ్మ‌మ్మ‌తో క‌లిసి దేవాల‌యానికి వెళ్లింది. సుమారు 40 ఏండ్ల నిందితుడు బాలిక‌ను ఆల‌య ఆవ‌ర‌ణ నుంచి కిడ్నాప్‌చేసి తీసుకెళ్లి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు.


అమ్మ‌మ్మ ఫిర్యాదు మేర‌కు నిందితుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాల‌ను పోలీసులు ట్రయల్ కోర్టు స‌మ‌ర్పించి చార్జిషీట్ దాఖ‌లు చేశారు. విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం ఈ కేసులో నిందితుడిని దోషి నిర్ధారించింది. అతనికి భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 AB (12 ఏండ్ల‌లోపు మహిళపై అత్యాచారం) కింద మరణశిక్ష విధించింది.


ట్ర‌య‌ల్ కోర్టు తీర్పుపై దోషి మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్ర‌యించాడు. అయితే, హైకోర్టు మ‌ర‌ణ శిక్ష‌ను ర‌ద్దుచేసింది. దోషి మిలిగిన జీవిత కాలాన్ని జీవిత ఖైదుగా మార్చింది. మ‌ళ్లీ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డంతో విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం దోషికి 30ఏండ్ల జైలుశిక్ష విధించింది. బాధితురాలి కుటుంబానికి రూ.1 ల‌క్ష జ‌రిమానా కూడా విధించింది.