SCR | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. హౌరా మార్గంలో 14 రైళ్లు రద్దు..

SCR | పశ్చిమ బెంగాల్‌ హౌరా మార్గంలో నడిచే 14 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశా బాలాసోర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం విధితమే. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనలో 280 మందికిపైగా మృతి చెందారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో ట్రాక్‌ మొత్తం దెబ్బతిన్నది. ప్రస్తుతం బహనగ బజార్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది […]

SCR | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. హౌరా మార్గంలో 14 రైళ్లు రద్దు..

SCR | పశ్చిమ బెంగాల్‌ హౌరా మార్గంలో నడిచే 14 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశా బాలాసోర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం విధితమే.

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటనలో 280 మందికిపైగా మృతి చెందారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో ట్రాక్‌ మొత్తం దెబ్బతిన్నది. ప్రస్తుతం బహనగ బజార్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఇప్పటికే వందలాది మంది కార్మికులు ట్రాక్‌ పునరుద్ధరణ చేపట్టడంతో రైలు ప్రయాణాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇంకా ట్రాక్‌ పనులు కొనసాగుతున్నాయి. హౌరా వైపు రాకపోకలు సాగించే పలు ట్రైన్స్‌ను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

సోమవారం నుంచి బుధవారం వరకు నడిచే 14 రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది. అయితే, 12న చెన్నై సెంట్రల్‌ -షాలిమార్‌ (ట్రైన్‌ నం. 12842) ట్రైన్‌ను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.