Journalist | సీనియర్ జర్నలిస్టు అంబటి కన్నుమూత

Journalist | విజయవాడ: నాలుగు దశాబ్దాలుగా వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యుజె మాజీ అధ్యక్షులు, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు కొద్ది సేపటి క్రితమే మృతి చెందారు. గత మూడు రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు సర్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆయన మరణం మీడియా లోకానికి తీరని లోటుగా భావిస్తూ రెండు రాష్ట్రాల జర్నలిస్టులు […]

  • Publish Date - June 25, 2023 / 01:11 AM IST

Journalist |
విజయవాడ: నాలుగు దశాబ్దాలుగా వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యుజె మాజీ అధ్యక్షులు, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు కొద్ది సేపటి క్రితమే మృతి చెందారు.

గత మూడు రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు సర్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆయన మరణం మీడియా లోకానికి తీరని లోటుగా భావిస్తూ రెండు రాష్ట్రాల జర్నలిస్టులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.