అమెరికాలో 40 నిమిషాల పాటు కాల్పులు.. 14 మంది మృతి

America | అగ్రరాజ్యం అమెరికాలో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. వ‌ర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ దుండ‌గుడు కాల్పులకు పాల్ప‌డ్డాడు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికా కాల‌మాన ప్ర‌కారం మంగ‌ళ‌వారం రాత్రి వాల్‌మార్ట్ స్టోర్‌లో బ్రేక్ రూమ్‌లోకి ఓ దుండ‌గుడు చొర‌బ‌డ్డాడు. అక్క‌డున్న వారిపై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. దుండ‌గుడి కాల్పుల‌కు 14 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో, వారిని చికిత్స […]

  • Publish Date - November 23, 2022 / 07:43 AM IST

America | అగ్రరాజ్యం అమెరికాలో మ‌రోసారి కాల్పుల మోత మోగింది. వ‌ర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ దుండ‌గుడు కాల్పులకు పాల్ప‌డ్డాడు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. అమెరికా కాల‌మాన ప్ర‌కారం మంగ‌ళ‌వారం రాత్రి వాల్‌మార్ట్ స్టోర్‌లో బ్రేక్ రూమ్‌లోకి ఓ దుండ‌గుడు చొర‌బ‌డ్డాడు. అక్క‌డున్న వారిపై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. దుండ‌గుడి కాల్పుల‌కు 14 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో, వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌నాస్థ‌లికి పోలీసులు చేరుకునే లోపే దుండ‌గుడు త‌న‌కు తాను కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే కాల్పుల‌కు పాల్ప‌డింది.. వాల్‌మార్ట్ స్టోర్‌లో ప‌ని చేస్తున్న మేనేజ‌ర్ అని పోలీసులు గుర్తించారు. మేనేజ‌ర్ కాల్పుల‌కు ఎందుకు పాల్ప‌డ్డాడు అనేది తెలియరాలేదు.