BRSకు షాక్: కాంగ్రెస్‌కు జై కొట్టిన కమ్యూనిస్టులు.. రేవంత్ పాదయాత్రలో పాల్గొన్న కామ్రెడ్లు
BRS, CPM, CPI, CONGRESS, REVANTH REDDY రేవంత్ పాదయాత్రలో కలిసి నడిసిన కమ్యూనిస్టులు బీజేపీ బూచి చూపి బీఆర్ఎస్‌తో పని చేయాలంటే ఎలా అంటున్నక్యాడర్ విధాత: కమ్యూనిస్ట్ పార్టీల్లో నేతలది ఒక దారి, క్యాడర్‌ది మరో దారి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ ఒక్కసారి 2024 ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌తో కలిసి పని చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకు బీజేపీని బూచిగా చూపిస్తున్నారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుపై క్యాడర్ తీవ్ర […]

BRS, CPM, CPI, CONGRESS, REVANTH REDDY
- రేవంత్ పాదయాత్రలో కలిసి నడిసిన కమ్యూనిస్టులు
- బీజేపీ బూచి చూపి బీఆర్ఎస్‌తో పని చేయాలంటే ఎలా అంటున్నక్యాడర్
విధాత: కమ్యూనిస్ట్ పార్టీల్లో నేతలది ఒక దారి, క్యాడర్‌ది మరో దారి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ ఒక్కసారి 2024 ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌తో కలిసి పని చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకు బీజేపీని బూచిగా చూపిస్తున్నారు.
అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుపై క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాల్సిన తమ పార్టీ నేతలు చివరకు ఆ పార్టీతోనే అంటకాగుతున్నారన్న అభిప్రాయం పార్గీ కింది స్థాయి క్యాడర్‌లో వ్యక్తమవుతున్నది.
పార్టీ నిర్ణయానికి ధిక్కరించిన కొంత మంది కింది స్థాయి నేతలు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. తాజా భద్రాచలం జిల్లా పినపాక నియోజకర్గం పరిధిలో సోమవారం రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ నేతలు తమ పార్టీ జెండాలు కప్పుకొని పాల్గొనడం విశేషం.
దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే పార్టీలతో కలిసి పని చేయాలని, ఈ మేరకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్ర స్థాయిలో ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవాలని, కలిసి పని చేయాలని కమ్యూనిస్టులు నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీల అగ్ర నేతలు రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా అధికార బీఆర్ఎస్‌తో ఈ ఒక్కసారి కలిసి పని చేయాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ మేరకు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. గెలుపు కోసం బీఆర్ఎస్ నేతల కంటే కాస్త ఎక్కువగానే కమ్యూనిస్ట్‌లు పనిచేశారు.
అవినీతి పాలనను అంతంచేసేందుకు కమ్యూనిస్ట్ నాయకులు కలిసి రావాలి #HaathSeHaathJodo #yatra4change #RevanthReddy pic.twitter.com/ypw2xSOOIc
— Aapanna Hastham (@AapannaHastham) February 13, 2023
మునుగోడు ఉప ఎన్నిక గెలుపుతో కమ్యూనిస్ట్‌ల పాత్ర కీలకంగా మారింది. దీంతో అప్పటినుంచి కమ్యూనిస్ట్ పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌తో దోస్తానా పెరిగింది. సీఎం కేసీఆర్‌కు కూడా రానున్న ఎన్నికల్లో గెలవాలంటే కమ్యూనిస్టులు అవసరమని భావించారు. ఈ మేరకు దోస్తానా కంటిన్యూ చేస్తున్నారు. ఏకంగా పొత్తుకు కూడా సిద్దమయ్యారు. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నేతలు తమకు ఎక్కడెక్కడ కేటాయింపులు జరుగుతాయన్న దానిపై ఇప్పటికే ఓ ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇలా బీఆర్ఎస్‌తో బంధం విడిపోలేనంత బలంగా కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నేతలకు కలిసిందన్న ప్రచారం జరుగుతోంది.
అయితే కమ్యూనిస్ట్ పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి కింది స్థాయి క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్‌తో కలిసి పని చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మతోన్మాద బీజేపీని దేశ వ్యాప్తంగా ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీ ఉందని, కాంగ్రెస్‌ను కాదని బీఆర్ఎస్‌తో పొత్తలేమిటని కొంత మంది నేతలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టకుంటున్నప్పుడు రాష్ట్రంలో కూడా అదే తీరుగా ఉండాలని అంటున్నారని తెలిసింది.
పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉందని, ప్రజా సమస్ లపై ఆందోళన చేస్తున్నదని చెబుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలపై తీవ్ర నెగెటివ్ ప్రభావం చూపుతున్న బీఆర్ఎస్‌తో ఎలా కలిసి పని చేస్తామని ప్రకటిస్తారని కింది స్థాయి నేతలు పార్టీ అగ్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు పార్టీ నిర్ణయం తమక నచ్చలేదన్న విషయం తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు, అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వరరావు పార్టీ జెండా భుజాన వేసుకొని పాల్గొనడం క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ మనోభావాలకు అద్దం పడుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.