London | కిటికీ సీటు కోసం గొడ‌వ‌.. ఎర్ర‌బ‌స్సులో కాదు విమానంలో

London విధాత‌: న‌న్న నా సీట్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌నివ్వ‌వా అని ఒక‌రు.. ఏం చేసుకుంటావో చేసుకో అని మ‌రొక‌రు పిడిగుద్దులు కురిపించుకున్న ఘ‌ట‌న ర్యాన్ ఎయిర్ సంస్థ విమానంలో చోటుచేసుకుంది. మాల్టా నుంచి లండన్‌కు వెళ్లిన విమానంలో ఈ ఫైటింగ్ జ‌రిగింది. వీడియోలో చెప్పిన ప్ర‌కారం.. పొట్టిగా ఎడ‌మ వైపు ఉన్న వ్య‌క్తి అమెరిక‌న్. అత‌డికి విండో సీట్ వ‌చ్చింది. పొడుగ్గా కుడి వైపున ఉన్న వ్య‌క్తి బ్రిట‌న్ పౌరుడు. అత‌డికి అమెరిక‌న్ ప‌క్క సీటు వ‌చ్చింది. […]

  • By: Somu    latest    Jul 10, 2023 10:26 AM IST
London | కిటికీ సీటు కోసం గొడ‌వ‌.. ఎర్ర‌బ‌స్సులో కాదు విమానంలో

London

విధాత‌: న‌న్న నా సీట్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌నివ్వ‌వా అని ఒక‌రు.. ఏం చేసుకుంటావో చేసుకో అని మ‌రొక‌రు పిడిగుద్దులు కురిపించుకున్న ఘ‌ట‌న ర్యాన్ ఎయిర్ సంస్థ విమానంలో చోటుచేసుకుంది. మాల్టా నుంచి లండన్‌కు వెళ్లిన విమానంలో ఈ ఫైటింగ్ జ‌రిగింది.

వీడియోలో చెప్పిన ప్ర‌కారం.. పొట్టిగా ఎడ‌మ వైపు ఉన్న వ్య‌క్తి అమెరిక‌న్. అత‌డికి విండో సీట్ వ‌చ్చింది. పొడుగ్గా కుడి వైపున ఉన్న వ్య‌క్తి బ్రిట‌న్ పౌరుడు. అత‌డికి అమెరిక‌న్ ప‌క్క సీటు వ‌చ్చింది. విమానంలోకి ముందు ఎక్కిన బ్రిట‌న్ పౌరుడు త‌న సీట్‌లో కూర్చున్నాడు.

త‌ర్వాత వ‌చ్చిన అమెరిక‌న్.. త‌న సీటు ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించ‌గా .. అత‌డు దారి ఇవ్వ‌లేదు. విండో సీటు త‌నదేన‌ని దారి ఇవ్వాల‌ని అడిగినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఏదో తిట్టాడు. దీంతో ఇద్ద‌రి మధ్యా గొడ‌వ చెల‌రేగింది.

కొంత మంది ఇద్ద‌రినీ విడ‌దీయ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. ఈ రోజు ఇంటికెళ్లిన‌ట్లే అని మ‌రొక‌రు అన‌డం వినిపించింది. త‌ర్వాత విమాన సిబ్బంది వ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు.

అయితే ఈ ఘ‌ర్ష‌ణ వ‌ల్ల విమానం రెండు గంట‌లు ఆల‌స్య‌మైంద‌ని వీడియోను పోస్ట్ చేసిన యూజ‌ర్ వాపోయాడు. ఈ ఘ‌ట‌న జులై 3 న జ‌ర‌గ‌గా తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.