Seethakka | ములుగుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి: సీతక్క

Seethakka | విధాత: ములుగు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అధికంగా జరిగినందున ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ధనసరి అనసూర్య (సీతక్క) డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడు అసెంబ్లీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల పై చర్చ జరిగిన సందర్భంగా సీతక్క మాట్లాడారు. తన నియోజకర్గంలో పదిహేను మందికి పైగా వరదల్లో కొట్టుకు పోయి చనిపోయారని, వారిలో కొందరి ఆచూకి ఇంత వరకు లభ్యం కాలేదన్నారు. ప్రాణ […]

  • Publish Date - August 4, 2023 / 12:51 AM IST

Seethakka |
విధాత: ములుగు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అధికంగా జరిగినందున ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ధనసరి అనసూర్య (సీతక్క) డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడు అసెంబ్లీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల పై చర్చ జరిగిన సందర్భంగా సీతక్క మాట్లాడారు.

తన నియోజకర్గంలో పదిహేను మందికి పైగా వరదల్లో కొట్టుకు పోయి చనిపోయారని, వారిలో కొందరి ఆచూకి ఇంత వరకు లభ్యం కాలేదన్నారు. ప్రాణ నష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా జరిగిందని, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయని ఆమె వివరించారు.

ఇప్పటి వరకు పలువురు పునరావాస శిబిరంలో తలదాచుకున్నారని, ముంపు ప్రాంతాల్లో ఉన్న తమ ఇళ్లకు వెళ్లలేని భయానక పరిస్థితులు ఉన్నాయని, అక్కడికి వెళ్తే పాములు కాటేస్తున్నాయని, అందుకే వెళ్లేందుకు బాధిత కుటుంబాలు భయపడుతున్నాయన్నారు. వీరికి ఎగువ ప్రాంతంలో పునరావసం కల్పించాలని ఆమె కోరారు.

వరదల కారణంగా పదిహేను గ్రామాల్లో ఇసుక మేటలు కమ్ముకున్నాయని, మేడారంలో స్థానికులు సర్వస్వం కోల్పోయి రోడ్డునపడ్డారన్నారు. వర్షాలు ఆగి వారం రోజులు అయినా ఇంత వరకు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించలేదని, ఇప్పటికైనా మంత్రి కెటిఆర్‌ స్పందించి తక్షణ సాయం ప్రకటించాలన్నారు.

గోదావరి, జంపన్న వాగు బాధితులకు భరోసా కల్పించేలా స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ కు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం చేయకపోవడం మూలంగా భారీగా ప్రాణ నష్టం సంభవించిందని, ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని సీతక్క విమర్శించారు.

Latest News