స‌హ‌జీవ‌నంపై బోర్..పెళ్లికి శృతిహసన్‌ గ్రీన్‌సిగ్నల్‌..!

విధాత: మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులకు ముందు వచ్చిన ముద్దుగుమ్మ శృతిహాసన్ సీనియర్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె ప్ర‌భాస్‌తో సలార్ అనే పాన్ ఇండియా మూవీలో కూడా నటిస్తోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల చిత్రాలలోనూ నటిస్తు ఈ అమ్మడు బిజీ బిజీగా ఉంది. క‌ష్ట‌ప‌డి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రేమ‌, స‌హ‌జీవ‌నం అంటూ త‌న కెరీర్‌ను తానే నాశ‌నం […]

  • Publish Date - January 30, 2023 / 05:01 AM IST

విధాత: మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులకు ముందు వచ్చిన ముద్దుగుమ్మ శృతిహాసన్ సీనియర్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె ప్ర‌భాస్‌తో సలార్ అనే పాన్ ఇండియా మూవీలో కూడా నటిస్తోంది.

తెలుగులోనే కాకుండా ఇతర భాషల చిత్రాలలోనూ నటిస్తు ఈ అమ్మడు బిజీ బిజీగా ఉంది. క‌ష్ట‌ప‌డి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రేమ‌, స‌హ‌జీవ‌నం అంటూ త‌న కెరీర్‌ను తానే నాశ‌నం చేసుకుంది. పభ్‌లు, పార్టీలు, వెకేషన్లు,డేటిండ్‌లు అంటూ బాయ్‌ఫ్రెండ్లను మారుస్తూ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తూ కేరీర్‌ను ఇబ్బందుల్లో పెట్టుకుంది.

మళ్లీ తెలుగులో రవితేజతో కలిసి నటించిన క్రాక్‌ సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చింది. తన ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ విషయంలో ఎప్పుడూ ఓపెన్‌గా ఉండే శృతి త‌న ప్రేమ‌, స‌హ‌జీవ‌నం వంటి విష‌యాల‌ను ప‌బ్లిక్ గానే చెబుతూ ఉంటుంది. హీరోయిన్‌గా సినిమాలు చేస్తునే డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారికతో ప్రేమాయణం నడిపించింది. ప్రస్తుతం ఇద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. దీని గురించి శృతిహాసన్ పదే పదే పోస్టులు కూడా పెడుతోంది.

తాజాగా శృతిహాసన్ సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం శృతిహాసన్, శాంతను హజారికాల వివాహానికి ఇరువైపులా కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో సాధ్యమైనంత త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. శృతిహాసన్ పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కెరీర్‌ను కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి.