హీరో సిద్ధార్థ్‌కు ఎయిర్‌పోర్ట్‌లో అవమానం

విధాత: విమాన ప్రయాణాలు చేసేటప్పుడు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సెలబ్రిటీలకైనా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. గతంలో ఎందరినో విమానాశ్రయాలలో నిలిపివేసి, పలు విధాలుగా వారిని పరిశీలించి, వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నా విమానయాన సంస్థలపై నాడు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. ఇక ముఖ్యంగా భార‌త్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ వంటి దేశ‌స్థుల‌పై విదేశీ విమాన సంస్థ‌లు కాస్త జాత్య‌హంకార ధోర‌ణితో ప్ర‌వ‌ర్తిస్తూ ఉండ‌టం కూడా స‌హ‌జ‌మే. ముఖ్యంగా ప్ర‌పంచంలో ఇస్లాం తీవ్ర‌వాదం పెరిగిన త‌ర్వాత […]

  • By: krs    latest    Dec 30, 2022 6:50 AM IST
హీరో సిద్ధార్థ్‌కు ఎయిర్‌పోర్ట్‌లో అవమానం

విధాత: విమాన ప్రయాణాలు చేసేటప్పుడు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సెలబ్రిటీలకైనా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. గతంలో ఎందరినో విమానాశ్రయాలలో నిలిపివేసి, పలు విధాలుగా వారిని పరిశీలించి, వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నా విమానయాన సంస్థలపై నాడు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. ఇక ముఖ్యంగా భార‌త్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ వంటి దేశ‌స్థుల‌పై విదేశీ విమాన సంస్థ‌లు కాస్త జాత్య‌హంకార ధోర‌ణితో ప్ర‌వ‌ర్తిస్తూ ఉండ‌టం కూడా స‌హ‌జ‌మే.

ముఖ్యంగా ప్ర‌పంచంలో ఇస్లాం తీవ్ర‌వాదం పెరిగిన త‌ర్వాత ముస్లిం పేర్ల‌తో ఉండే వారికి వేధింపులు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. ఇక మ‌న సిక్కుల త‌ల‌పాగా చూసి ముస్లింల‌నే భావ‌న‌తో విమాన‌యాన సంస్థ‌లు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉండ‌టం జ‌రుగుతూనే ఉంది. ఇక ఈ వేధింపులు సెల‌బ్రిటీల‌ను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తమలాంటి సెలబ్రిటీలను కూడా ఇలా వేధించడం సరికాదంటూ వారు నానా యాగీ చేస్తుంటారు. బాలీవుడ్ హీరోలలో ప్రముఖులైన ఖాన్‌లు కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారిని విదేశాలలో నిలిపివేసి మీరు పాకిస్తాన్ వారా లేక భారతీయులా? అని ప్రశ్నించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

విషయానికి వస్తే తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నాటి డ్రీమ్ బాయ్ సిద్ధార్థ్. ప్రేమకథా చిత్రాలలో నటించి ఎందరో అభిమానులను ఆయ‌న సంపాదించుకున్నారు. ఈయన నటించిన ‘బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి పలు చిత్రాలు ఆయనకు ఎక్కడా లేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి.

ఇక ఈయన ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సామాజిక విషయాలపై కూడా వాటిని నెటిజ‌న్ల‌తో పంచుకుంటూ ఉంటాడు. సినిమాల గురించి, రాజ‌కీయాల నుంచి క్రికెట్‌ వ‌ర‌కు.. ఇలా ప్రతిదానిపై ఆయ‌న త‌న అభిప్రాయ‌ల‌ను వ్య‌క్తం చేస్తూ ఉంటారు. తాజాగా మ‌ధురై ఎయిర్ పోర్ట్‌లో ఆయ‌న‌కు చేదు అనుభవం ఎదురైందని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్ పోర్ట్‌ సిబ్బంది తీరుపై మండి పడ్డాడు.

ఆయన మాట్లాడుతూ నేను మా తల్లిదండ్రులతో కలిసి వస్తుంటే మ‌ధురై విమానాశ్రయంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది వేదించారు. ఏకంగా 20 నిమిషాల పాటు మాపై దురుసుగా ప్రవర్తించారు. పదేపదే హిందీలో మాట్లాడారు. ఇంగ్లీష్‌లో మాట్లాడాలని నేను అడిగినా పట్టించుకోలేదు. మా అమ్మానాన్నల బ్యాగులు చెక్ చేస్తూ అందులో ఉన్న వస్తువులన్నీ తీయాలని అన్నారు. వాళ్లు పెద్దవాళ్ళని నేను స‌ర్ది చెప్పినా కూడా ఇండియాలో ఇలాగే ఉంటుందని బెదిరించి దురుసుగా బ‌దులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలతో పాటు ఈయన బాయ్స్, ఆట, ఓయ్ వంటి తెలుగు చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను అలరించారు. కొన్నేళ్ల విరామం తర్వాత ఇటీవ‌ల ఆయ‌న శ‌ర్వానంద్‌తో కలిసి మహాసముద్రం చిత్రంలో నటించారు. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో క‌మల్‌హాస‌న్‌కు కుమారుడిగా ఓ కీల‌క‌ పాత్రను పోషిస్తున్నాడని సమాచారం.