Singapore | TCSS సింగపూర్ ఆధ్వర్యంలో.. ఘనంగా బోనాల జాతర

Singapore సింగపూర్: ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం (09 జులై 2023) మధ్యాహ్నం అత్యంత వైభవంగా జరిగాయి. భాగ్యనగరం లో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూరు లో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్‌’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక […]

  • Publish Date - July 10, 2023 / 12:03 AM IST

Singapore

సింగపూర్: ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం (09 జులై 2023) మధ్యాహ్నం అత్యంత వైభవంగా జరిగాయి. భాగ్యనగరం లో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూరు లో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్‌’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. ఇతరులు సుమారు 800 మంది భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలుగింటి ఆడపడుచులకు తాంబూళం అందజేసి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్‌ఎస్‌ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

సింగపూర్ లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా అందరు తెలుగు వారితో పాటు ఇతరులు ఈ బోనాల జాతరలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా TCSS వారు తొలిసారి 2017 లో బోనాల పండుగను నిర్వహించి సింగపూర్ కు ఈ పండుగ ప్రాముఖ్యతని పరిచయం చేసిన రోజులను గుర్తు చేసుకొని సంతోషించారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగ తో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు.

బోనాల జాతర లో పోతరాజు మరియు పులి వేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీకాంత్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్, గూర్ల లక్ష్మీపతి లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఏడాది బోనం సమర్పించిన వారిలో గడప స్వాతి రమేశ్, గోనె రజిత నరేందర్ రెడ్డి, బండ శ్రీదేవి మాధవ రెడ్డి, గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, అలేఖ్య దార, గౌరీ శ్రీనివాస్ మరియు పద్మ గార్లు ఉన్నారు. వీరితో పాటు గడప రమేశ్ అమ్మవారికి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.

బోనాల పండుగలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి,

రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మరియు సదానందం అందె కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.

ఈ వేడుకలకు సహకారం అందించిన మకుట డెవలపర్స్ శ్రీకర్ రెడ్డి, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి ఇంఫ్రాస్ట్రక్చర్స్, మై హోమ్ సంయుక్ తో పాటు చిలుకూరి చంద్రశేఖర్ మరియు డార్విన్ బైస గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలకు సంతోష్ వర్మ మాదారపు, సతీష్ పెసరు, శివ ఆవుల, ప్రవీణ్ మామిడాల, రాధికా రెడ్డి నల్లా, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, శశిధర్ రెడ్డి, బొందుగుల రాము మరియు కాసర్ల శ్రీనివాస రావు గార్లు సమన్వయ కర్తలుగ వ్యవహరించారు.

Latest News