Trains Cancelled | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. విజయవాడ డివిజన్‌లో భారీగా రైళ్ల రద్దు.. వివరాలు ఇవే..!

Trains Cancelled | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్‌.. విజయవాడ డివిజన్‌లో భారీగా రైళ్ల రద్దు.. వివరాలు ఇవే..!

Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు పలురైళ్లను రద్దుచేసింది. విజయవాడ డివిజన్‌ బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలో మూడోలైను నిర్మాణంతోపాటు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్‌ 4, 6, 8 తేదీల్లో తిరుపతి-విశాఖ (రైలు నం.22708) డబుల్‌ డెక్కర్‌, అక్టోబర్‌ 5, 7, 9 తేదీల్లో విశాఖ-తిరుపతి (22707) డబుల్‌ డెక్కర్‌ రైలును రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

భువనేశ్వర్‌-తిరుపతి (02809) ప్రత్యేక రైలు ఈ నెల 30, అక్టోబర్‌ 7 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతి – భువనేశ్వర్‌ (02810) ప్రత్యేక రైలు అక్టోబర్‌ 1, 8 తేదీల్లో రద్దు చేశారు. అక్టోబర్‌ 8న భువనేశ్వర్‌-తిరుపతి(22871), అక్టోబర్‌ 9న తిరుపతి – భువనేశ్వర్‌ (22872) రద్దయ్యాయి. అక్టోబర్‌ 2, 9 తేదీల్లో, చెన్నై సెంట్రల్‌-విశాఖ(22870), ఈ నెల 26, అక్టోబర్‌ 3, 10 తేదీల్లో సంబల్‌పూర్‌-ఈరోడ్‌ (08311) ప్రత్యేక రైలు రద్దయ్యాయి.

ఈ నెల 27, అక్టోబర్‌ 4న, ఈరోడ్‌-సంబల్‌పూర్‌ (08312) ప్రత్యేక రైలును అధికారులు రద్దు చేశారు. ఈ నెల 29, అక్టోబరు 6న, విశాఖ-బెంగళూరు కంటోన్మెంట్‌(08543) స్పెషల్ రైలును.. ఈ నెల 24, అక్టోబర్‌ 1, 8 తేదీల్లో, బెంగళూరు కంటోన్మెంట్‌-విశాఖ(08544) ప్రత్యేక రైలు ఈనెల 25, అక్టోబరు 2, 9 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. అయితే, బొకారో ఎక్‌ప్రెస్‌ రైలు దారి మళ్లించినట్లు అధికారులు వివరించారు.

ధన్‌బాద్‌-అలెప్పీ(13351) బొకారో ఎక్స్‌ప్రెస్‌ అక్టోబర్‌ 2, 10 తేదీల్లో నిడదవోలు, భీమవరం టౌన్‌, గుడివాడ, విజయవాడ మీదుగా నడుస్తుందని, ఆయా రోజుల్లో తాడేపల్లిగూడెం, ఏలూరు స్టాప్‌లను రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ మేరకు ఆయా ప్రయాణికులు గమనించి సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.