Indian Railway | దసరా, దీపావళికి భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వేశాఖ..!

Indian Railway | దసరా, దీపావళికి భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వేశాఖ..!

Indian Railway | పండుగల నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దసరా, దీపావళి పండగల సందర్భంగా రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. రిజర్వేషన్‌ సైతం కల్పించినట్లు అధికారులు తెలిపారు.



పాట్నా-సికింద్రాబాద్ (రైలు నంబర్‌ 03253) అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి సోమవారం, బుధవారం అందుబాటులో ఉండనున్నది. హైదరాబాద్-పాట్నా (07255) అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి బుధవారం నుడవనున్నది. సికింద్రాబాద్-పాట్నా అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతి శుక్రవారం నడువనున్నది.



బౌరనీ-కొయంబత్తూర్ (03357) అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రతి శనివారం.. కొయంబత్తూర్-బౌరనీ (03357) అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ 13 వరకు ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. దానాపూర్-సికింద్రాబాద్ (03225) అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి గురువారం పరుగులు తీయనున్నది.



సికింద్రాబాద్-దానాపూర్ (03226) అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి ఆదివారం నడువనున్నది. దానాపూర్-బెంగళూరు (03245) అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి బుధవారం.. బెంగళూరు-దానాపూర్ (03246) అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతి శుక్రవారం ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.



దానాపూర్-బెంగళూరు (03251) అక్టోబర్ ఒకటి నుంచి డిసెంబర్ 10 వరకు ప్రతి ఆదివారం, సోమవారం నడువనుండగా.. బెంగళూరు-దానాపూర్ (03252) అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 12 వరకు ప్రతి మంగళవారం, బుధవారం అందుబాటులో ఉండనున్నది. దానాపూర్-బెంగళూరు (03259) అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రతి మంగళవారం, బెంగళూరు-దానాపూర్ (03260) అక్టోబర్ 5 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి గురువారం నడువనున్నది.



దానాపూర్-బెంగళూరు (03247) అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 7 వరకు ప్రతి గురువారం.. బెంగళూరు-దానాపూర్ (03248) అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. దానాపూర్-బెంగళూరు (03241) అక్టోబర్ 6 నుంచి డిసెంబర్ 8 వరకు ప్రతి శుక్రవారం, బెంగళూరు-దానాపూర్ (03242) మార్గంలో అక్టోబర్ 8 నుంచి డిసెంబర్ 10 వరకు ప్రతీ ఆదివారం నడువనున్నది. ఆయా రైళ్లలో రిజర్వేషన్‌ సైతం ప్రారంభించినట్లు భారతీయ రైల్వేశాఖ తెలిపింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని వివరించింది.