వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ తరఫున పోటీ చేస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. అలాగే ఏపీ సీఎం జగన్‌పై సంచలన కామెంట్లు చేశారు. రాజశేఖర్‌రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదన్నారు. పాలన మొదటి రోజు నుంచే అవినీతి మొదలుపెట్టారు.
వైసీపీలో నేను ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉందన్నారు. ఈసారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే అదే గొప్ప అన్నారు. ఏపీని చంద్రబాబు తప్ప మరో నేత కాపాడలేరన్నారు. జనసేన అధినేత పవన్ నిజాయితీని ప్రశ్నించలేం అన్నారు. రాష్ట్రం కోసం వారిద్దరూ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపిపారు. జనవరి 3 నుంచి వివేకా కేసు మలుపులు తిరగనున్నదని డీఎల్ వ్యాఖ్యానించారు.
డీఎల్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తున్నది. అలాగే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే బాగుంటుంది అన్నారు. దీన్నిబట్టి ఆ రెండుపార్టీల మధ్య పొత్తు కుదరబోతున్నది అనే సంకేతాలు ఇచ్చారా అని అనుకుంటున్నారు.