వీధి కుక్క దాడి.. ఏడాది ప‌సిబిడ్డ ముఖంపై 60 కుట్లు

విధాత: ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఏడాది వ‌య‌సున్న ఓ ఆడ శిశువు తన ఇంటి ముందు ఆడుకుంటుండ‌గా, ఆ పాపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాల‌పాలైన ఆ శిశువు ముఖంపై 60 కుట్లు ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో వెలుగు చూసింది. ఘ‌జియాబాద్ విజ‌య్‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని బెహ్రాంపూర్ ఏరియాలో ఏడాదిన్న‌ర వ‌య‌సున్న ఓ పాప ఇంటి ముందు ఆడుకుంటుంది. అటుగా వ‌చ్చిన ఓ వీధి కుక్క ఆమెపై […]

  • Publish Date - November 23, 2022 / 01:29 AM IST

విధాత: ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఏడాది వ‌య‌సున్న ఓ ఆడ శిశువు తన ఇంటి ముందు ఆడుకుంటుండ‌గా, ఆ పాపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాల‌పాలైన ఆ శిశువు ముఖంపై 60 కుట్లు ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో వెలుగు చూసింది.

ఘ‌జియాబాద్ విజ‌య్‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని బెహ్రాంపూర్ ఏరియాలో ఏడాదిన్న‌ర వ‌య‌సున్న ఓ పాప ఇంటి ముందు ఆడుకుంటుంది. అటుగా వ‌చ్చిన ఓ వీధి కుక్క ఆమెపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి, తీవ్రంగా గాయ‌ప‌రిచింది. పాప ముఖంపై తీవ్ర గాయాల‌య్యాయి.

తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ ప‌డుతున్న బాలిక‌ను చికిత్స నిమిత్తం ఘ‌జియాబాద్‌లోని ఎంఎంజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చిన్నారి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో నోయిడాలోని పిల్ల‌ల ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని సూచించారు. పాప‌కు రేబిస్ ఇంజెక్ష‌న్ కూడా ఇవ్వ‌కుండా వైద్యులు నిర్ల‌క్ష్యం వ‌హించారు. వారు ప్ర‌యివేటు క్లినిక్‌లోనే రేబిస్ ఇంజెక్ష‌న్ తీసుకున్నారు.

అయితే పాప‌కు నోయిడాలో చికిత్స అందించ‌క‌పోవ‌డంతో తిరిగి, ఎంఎంజీకి తీసుకొచ్చారు. వైద్యం చేయ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని త‌ల్లిదండ్రులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ దాకా వెళ్లింది. దీంతో హుటాహుటిన డాక్ట‌ర్లు పాప‌కు స‌ర్జ‌రీ నిర్వ‌హించారు. పాప ముఖంపై 60 నుంచి 70 కుట్లు ప‌డ్డాయ‌. ప్ర‌స్తుతం చిన్నారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.