Street dogs | వెంటాడుతున్నాయ్.. వీధి కుక్కల స్వైర విహారం.. రహదారుల వెంబడి తప్పని పరుగులు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లాలో నడిచి వెళ్తున్న ప్రజలపై శునకాలు (Street dogs ) వెంటబడి భయానికి గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగి ఘటనతో ఒక్కసారి ప్రజలు భయందోళనలో పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచ్చల విడిగా స్వైరవిహారం చేస్తున్నాయి. మంగళవారం సిద్దిపేట (Siddipet) జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన బాలిక పిన్నింటి చిన్ని కుక్కల బారి నుండి తృటిలో తప్పించుకుంది. అయితే.. అంతలోనే అది గమనించిన చేపూరి తిరుపతి వెంటనే […]

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లాలో నడిచి వెళ్తున్న ప్రజలపై శునకాలు (Street dogs ) వెంటబడి భయానికి గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగి ఘటనతో ఒక్కసారి ప్రజలు భయందోళనలో పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచ్చల విడిగా స్వైరవిహారం చేస్తున్నాయి. మంగళవారం సిద్దిపేట (Siddipet) జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన బాలిక పిన్నింటి చిన్ని కుక్కల బారి నుండి తృటిలో తప్పించుకుంది.
అయితే.. అంతలోనే అది గమనించిన చేపూరి తిరుపతి వెంటనే కుక్కలను తరిమేసి బాలికను హక్కున చేర్చుకున్నాడు. కొన్ని కుక్కలను పట్టుకొని అడవుల్లో వదిలేసే విధంగా చర్యలు చేపట్టారు .ఆ తర్వాత నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడం వలన వాటి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో నగరంలో ఏ వీధికి వెళ్లినా, ఏ ప్రధాన రహదారిలోనైనా కుక్కలు కనిపిస్తూ భయపెడుతున్నాయి.
రహదారుల వెంబడి పరుగులు
ప్రధాన రహదారుల సెంటర్లలో కుక్కలు పాదచారుల వెంట పడి మరీ కరుస్తున్నాయి. మొరిగే కుక్క కరవదు అంటారు. కానీ మొరగని కుక్కలే కాదు మొరగేవి సైతం కూడా పిక్కల పట్టుకొని పీకుతున్నాయి శునకాల గుంపుతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కుక్కల గుంపులను చూసి గడగడలాడి పోతున్నారు.. రాత్రి, పగలు అని తేడా లేకుండా వెంటపడి మరీ కరుస్తున్నాయి. పాదచారులనే కాదు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని సైతం వదలటం లేదు. శునకాల దెబ్బకు ఇంటి నుండి బయటకు రావాలంటే రాత్రి పూట భయపడే పరిస్థితి అనేక వీధుల్లో నెలకొంది.
ఉదయం ఇంటింటికీ పేపర్ వేసే వారు కూడా కుక్కలు కారణంగా 7 గంటలు సమయంలో పేపరు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి నియంత్రణకు స్పందనలో కమిషనర్‌కి వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోతోంది. జంతు పరిరక్షణ చట్టం వల్ల వీధి కుక్కల సంఖ్య పెరిగి వాటి వీర విహారం కూడా పెరిగిపోయింది. గతంలో కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం వీటి నియంత్రణకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు.
యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..
పెరిగిన కుక్కల సంతతి
గ్రామాల్లో కుక్కల సంతతి వృద్ధి చెందింది. ప్రస్తుతం వీటి సంఖ్య రెండింతలు పెరిగి ఉంటాయని పశుసంవర్ధకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కుక్కలకు ఫంక్షన్‌హాళ్ల వద్ద ఆహార వ్యర్థాలు లభించినంత వరకు అక్కడే ఉంటున్నాయి.
ఫ్రిజ్‌లోకి దూరిన నాగుపాము.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..u
వేడుకలు లేనప్పుడు వీధుల్లోకి వస్తున్నాయి. మాంసం విక్రయ కేంద్రాలు, ఆహారశాలలు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ క్రమంగా ఇళ్ల వద్దకు వస్తున్నాయి. అలా వాటి సంఖ్య రెట్టింపు అవుతోంది. కుక్కల స్వైరవిహారాన్ని కట్టడి చేయడం కష్టతరంగా మారింది. కుక్కల నియంత్రణకు గతంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
బడి నుంచి వచ్చే వరకు భయమే
ఉమ్మడి జిల్లాలో కుక్కల దాడుల సంఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటంతో బడి నుంచి తమ పిల్లలు ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులను భయం వెంటాడుతూనే ఉంది. రోడ్లపై నడుచుకుంటూ వచ్చే సమయంలో కుక్కల గుంపులు వెంటబడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న కుక్కల దాడులతో తల్లిదండ్రులే స్వయంగా పాఠశాలకు దించి వస్తున్నారు.
చూసే వారి గుండెలు జారాల్సిందే.. మనిషి లోతు పడగ విప్పిన నాగుపాము
బెంబేలెత్తుతున్న ద్విచక్ర వాహన దారులు
జిల్లాలో ద్విచక్ర వాహనదారులను కుక్కలు తరుముతున్నాయి. ప్రధానంగా చీకటి పడిన తర్వాత కుక్కలు ఎటు వైపు నుంచి దాడి చేస్తాయో.. తెలియని పరిస్థితి నెలకొంది. పనులు ముగించుకుని గ్రామాలకు వస్తున్న వారిని వెంబడిస్తున్నాయి. బైకుల వెంట పరిగెత్తుతూ కరుస్తున్నాయి.