Suma: పాపం.. సుమ‌కి ఎంత క‌ష్టం వ‌చ్చింది.. ఆకులు తిని బ‌తికేస్తుందిగా..!

Suma: బుల్లితెర మెగాస్టార్‌గా మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ సుమ షోలో మీద షోలు చేసుకుంటూ పోతుంది. మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. చ‌లాకీ మాటలతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది.గ‌త 16 సంవత్సరాలుగా అల‌రిస్తూ వ‌స్తున్న సుమ యాంక‌ర్‌గానే కాదు న‌టిగాను తెలుగు ప్రేక్షకుల‌కి ద‌గ్గ‌రైంది. సినిమాల‌లో బ్రేక్ రాక‌పోవ‌డంతో సుమ యాంక‌ర్‌గా ఇండ‌స్ట్రీలో దూసుకుపోతుంది. సుమ టీవీ షో అయిన ప్రీ రిలీజ్ వేడుక‌లు అయిన స‌రే స‌క్సెస్ చేయాల్సిందే. ఎంత పెద్ద […]

  • Publish Date - July 12, 2023 / 09:48 AM IST

Suma: బుల్లితెర మెగాస్టార్‌గా మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ సుమ షోలో మీద షోలు చేసుకుంటూ పోతుంది. మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. చ‌లాకీ మాటలతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది.గ‌త 16 సంవత్సరాలుగా అల‌రిస్తూ వ‌స్తున్న సుమ యాంక‌ర్‌గానే కాదు న‌టిగాను తెలుగు ప్రేక్షకుల‌కి ద‌గ్గ‌రైంది. సినిమాల‌లో బ్రేక్ రాక‌పోవ‌డంతో సుమ యాంక‌ర్‌గా ఇండ‌స్ట్రీలో దూసుకుపోతుంది. సుమ టీవీ షో అయిన ప్రీ రిలీజ్ వేడుక‌లు అయిన స‌రే స‌క్సెస్ చేయాల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన స‌రే సుమ సింగిల్ హ్యాండ్‌తో డీల్ చేస్తుంది. చాలా రోజుల త‌ర్వాత జయమ్మ పంచాయితీ అనే చిత్రంతో వెండితెర‌పై అల‌రించింది సుమ‌.

ఈ సినిమా కోసం సుమ చాలానే క‌ష్ట‌ప‌డింది. ముఖ్యంగా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో చేసిన కూడా, సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈవిడ సినిమాలు చేసే ఆలోచన వదిలేసి యాంక‌ర్‌గానే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే సుమ సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో రీసెంట్‌గా ఫ్యామిలీతో ఓ రెస్టారెంట్‌లో ఫుడ్ తింటున్న వీడియో షేర్ చేసింది. ఆ వీడియో గ‌మ‌నిస్తే… సుమ ప్లేట్ లో ఆకుల సమాహారం ఉంది. దీనిని ఉద్దేశిస్తూ…. ‘పుష్ప మూవీలోని డైలాగ్ చెప్పింది. ఆకులు తింటది మేక… మేకను తింటుంది పులి అన్నారు. ఆకులు మేకలే కాదు మనుషులు కూడా తింటారంటూ కాస్త కామెడీ కూడా చేశారు.

ప్ర‌స్తుతం సుమ త‌న ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సుమ బుల్లితెర‌పైనే కాదు ఇలా సోష‌ల్ మీడియాలోను అల‌రిస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సుమ ఇటీవ‌ల ఓ కొత్త షో మొద‌లు పెట్టిన వియం తెలిసిందే. సుమ అడ్డా పేరుతో ఒక షో చేస్తుండ‌గా, దీనికి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఈ మలయాళీ అమ్మాయి నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకోగా, వీరి వైవాహిక జీవితంలో ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కొడుకుని హీరో చేయాల‌ని వారు ఎంతో తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు.

Latest News