Supreme Court | సాయిబాబా కేసును.. పునర్విచారించండి: సుప్రీంకోర్టు

మావోయిస్టులతో సంబంధాలు ఆరోపణలతో.. సాయిబాబ, మరో ఐదుగురు అరెస్ట్‌ విచారణ అనంతరం గత ఏడాది యావజ్జీవ శిక్ష విధించిన ట్రయల్‌ కోర్టు ట్రయల్‌ కోర్టు తీర్పును కొట్టేస్తూ.. ఆయనను నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు విధాత‌: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జీఎన్‌ సాయిబాబా కేసును మరోసారి విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో ఆయనకు సంబంధాలున్నాయని 2014లో 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని మహారాష్ట్ర […]

  • Publish Date - April 19, 2023 / 06:41 AM IST
  • మావోయిస్టులతో సంబంధాలు ఆరోపణలతో.. సాయిబాబ, మరో ఐదుగురు అరెస్ట్‌
  • విచారణ అనంతరం గత ఏడాది యావజ్జీవ శిక్ష విధించిన ట్రయల్‌ కోర్టు
  • ట్రయల్‌ కోర్టు తీర్పును కొట్టేస్తూ.. ఆయనను నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టు

విధాత‌: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జీఎన్‌ సాయిబాబా కేసును మరోసారి విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో ఆయనకు సంబంధాలున్నాయని 2014లో 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

విచారణ తర్వాత సాయిబాబాకు ట్రయల్‌ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. గత ఏడాది ట్రయల్‌ కోర్టు తీర్పును కొట్టివేస్తూ.. బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. దీనిపై ఎన్‌ఐఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. తాజాగా హైకోర్టు నిర్ణయాన్నికొట్టేస్తూ.. 4 నెలల్లో సాయిబాబా కేసును పునర్‌ విచారణ చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.