Karnataka | కర్ణాటక సీఎం అభ్యర్థిఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ

Karnataka | విధాత‌: కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ విషయం ఢిల్లీకి చేరిండంతో అధిష్ఠానం పిలుపు మేరకు సిద్ధరామమ్య ఇప్పటికే హస్తినకు చేరారు. పార్టీ ముఖ్యనేతల భేటీలో ఆయన పాల్గొననున్నారు. తనను ఢిల్లీకి రావాలని హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చిందన్న డీకే శివకుమార్‌ తనకు కడుపులో ఇన్ఫెక్షన్‌ కారణంగా వెళ్లలేకపోతున్నట్టుత తెలిపారు. అయితే మ‌రోసారి అధిస్థానం పిలుపు రావ‌డంతో ఈరోజు ఉద‌యం ఢిల్లీ వెళ్లారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి 135 మంది […]

Karnataka | కర్ణాటక సీఎం అభ్యర్థిఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ

Karnataka |

విధాత‌: కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ విషయం ఢిల్లీకి చేరిండంతో అధిష్ఠానం పిలుపు మేరకు సిద్ధరామమ్య ఇప్పటికే హస్తినకు చేరారు. పార్టీ ముఖ్యనేతల భేటీలో ఆయన పాల్గొననున్నారు. తనను ఢిల్లీకి రావాలని హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చిందన్న డీకే శివకుమార్‌ తనకు కడుపులో ఇన్ఫెక్షన్‌ కారణంగా వెళ్లలేకపోతున్నట్టుత తెలిపారు.

అయితే మ‌రోసారి అధిస్థానం పిలుపు రావ‌డంతో ఈరోజు ఉద‌యం ఢిల్లీ వెళ్లారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తనకు సొంతంగా ఏ ఎమ్మెల్యే లేరని డీకే అన్నారు. సీఎం ఎవరు అన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని చెప్పారు.

సీఎం ఎవరన్నది ప్రకటించనున్న ఖర్గే

సీఎం అభ్యర్థి ఎంపిక కోసం సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించిన పరిశీలకుల బృందం నివేదిక సిద్ధం చేసింది. ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడిన వారు సీఎంగా ఎవరు ఉండాలనేది అభిప్రాయాలు సేకరించారు. వారిలో కొంతమంది నేరుగా సమాధానం ఇవ్వగా.. మరికొంతమంది బ్యాలెట్‌ ద్వారా జవాబు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన పరిశీలకుల బృందం ఆ నివేదికను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఇవ్వడానికి ఆయన నివాసానికి వెళ్లింది. కర్ణాటక సీఎం ఎవరు అన్నది ఖర్గే తేల్చనున్నారు.

అభ్యర్థిని ప్రకటించే ముందు సోనియా, రాహుల్‌తో మాట్లాడనున్న ఖర్గే

సీఎం అభ్యర్థిని ప్రకటించే ముందు కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో ఖర్గే మాట్లాడనున్నారు. ఈ నెల 18వ తేదీనే ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉండనున్నది. కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తి నెలకొన్నది. ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి రణదీప్‌ సూర్జేవాలా అభ్యర్థి ప్రకటన ఎక్కువ సమయం పట్టబోదని తెలిపారు.

కర్ణాటక సీఎం అభ్యర్థి అంశం అధిష్టానం చేతికి వెళ్లడంతో సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకున్నారు. డీకే శివకుమార్‌ కూడా ఢిల్లీ వెళ్లనున్నట్టు మొదట చెప్పినా..అనారోగ్యం కారణంతో విరమించుకున్నట్టు చెప్పారు. సీఎంగా ఎవరు అన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందని అన్నారు.

అధిష్ఠానానికి డీకే సంకేతాలు

కర్ణాటక సీఎం ఎవరన్న దానిపై తర్జనభర్జన కొనసాగుతున్న సమయంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు ఎమ్మెల్యేలు లేరు. వారి అభిప్రాయం ఏమిటో నాకు తెలియదు. మొదట మాకు 136 మంది ఎమ్మెల్యేలు.. తర్వాత 135 మంది ఆ తర్వాత ఒకరి చేరికతో మొత్తం 136 ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్లంతా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు. నాకు సొంతంగా ఎమ్మెల్యేలు లేరు. రహస్య ఓటింగ్‌ ఏమిటో నాకు తెలియదు. సీఎం అభ్యర్థి ఎంపిక నిర్ణయం అధిష్ఠానం నిర్ణయిస్తుందని మేము స్పష్టం చేశామన్నారు.

అంతకు ముందు ఒంటరిగానే 135 ఎమ్మెల్యేలను గెలిపించానని, తన నేతృత్వంలోనే కాంగ్రెస్‌ పార్టీకి అన్ని సీట్లు వచ్చాయని అధిష్ఠానానికి గట్టి సంకేతాలు పంపారు. పార్టీ హైకమాండ్‌ ముందు నిర్ణయం తీసుకోనివ్వండి.. అవసరమైతే తన నిరసనను తెలియజేస్తాను అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షులంతా తనవైపే ఉన్నారని, తన బలాన్ని ఎవరూ లాక్కోలేరని, వేరే వాళ్ల బలం గురించి తాను మాట్లాడనని డీకే అన్నారు.