విధాత: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో నిన్న జరిగిన టెన్త్ క్లాస్ తెలుగు పేపర్ జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్‌కు బాధ్యులైన ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు.
పదో తరగతి విద్యార్థుల తెలుగు పరీక్ష జవాబు పత్రాల బండిల్స్ తరలింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉట్నూర్ పోస్ట్ ఆఫీసులో పని చేస్తున్న V.రజిత (MTS), నాగరాజు (ఔట్ సోర్సింగ్ ) సిబ్బందిని సస్పెండ్ చేశారు.