విధాత: సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఇతర ఉద్యోగులపై జూబిలీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షాద్‌నగర్ సమీపంలో సువర్ణ కుటీర్‌లో స్థలాలు కొన్న 21 మంది వినియోగదారులు సువర్ణభూమి ఎండీపై ఫిర్యాదు చేశారు.
తాము ఆరు లక్షల నుంచి 50 లక్షల దాకా డబ్బు వెచ్చించి స్థలాలు కొన్నామని, ఇంతరవరకు స్థలాలు రిజిస్ట్రేషన్ చేయలేదని వారు ఫిర్యాదు చేశారు.
కాగా.. తాము డబ్బులు చెల్లించిన రసీదులు కూడా పోలీసులకు సమర్పించారు. సువర్ణభూమి డెవలపర్స్ మాత్రం ఆ వినియోగదారులతో తమకు సంబంధం లేదని, ఆ రసీదులు తాము ఇచ్చినవి కాదని చెబుతున్నారు.
కంపెనీ ఎండీ బొల్లినేని శ్రీధర్, జనరల్ మేనేజర్ ప్రవీణ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్, తదితరులు తమ నుంచి డబ్బు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు