Tanikella bharani | గంజాయి, సిగరెట్స్ ఫుల్‌గా తాగేవాడినంటూ కన్నీరు పెట్టుకున్న తనికెళ్ల
Tanikella bharani | గత 30 ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో అలరిస్తున్న నటుడు తనికెళ్ల భరణి. విలన్‌గాను, కమెడీయన్‌గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను తనికెళ్ల ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు. మొదట రైటర్‌గా వచ్చి తర్వాత నటుడిగా ఎదిగారు. ఆయన తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. నా చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అంటూ తనికెళ్ల చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. యమలీలలో తోట రాముడిపాత్ర, అతడు చిత్రంలో […]
Tanikella bharani |
గత 30 ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో అలరిస్తున్న నటుడు తనికెళ్ల భరణి. విలన్‌గాను, కమెడీయన్‌గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను తనికెళ్ల ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు. మొదట రైటర్‌గా వచ్చి తర్వాత నటుడిగా ఎదిగారు. ఆయన తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. నా చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అంటూ తనికెళ్ల చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది.
యమలీలలో తోట రాముడిపాత్ర, అతడు చిత్రంలో నాయుడు పాత్ర, ఇటీవల వచ్చిన రాజా ది గ్రేట్ చిత్రంలో విలన్ తండ్రి పాత్ర ఇలా ఎన్నో తనికెళ్లని తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర చేశాయి. అయితే తనికెళ్ల శివుడికి వీర భక్తుడు కాగా, ఇప్పుడు ఆయన శివుడిపై పాటలు రాయడమే కాక పాడి వినిపిస్తున్నాడు. అయితే తనికెళ్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంజాయి, సిగరెట్ ఫుల్‌గా తాగేవాడినని చెప్పి ఆశ్చర్యపరిచాడు.
తనికెళ్ళ భరణి తాజాగా తన బాల్యం ఎలా ఉండేదో, తండ్రితో ఆయన అనుబంధం ఎలాంటిదో గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. ఏడో తరగతిలో ఉన్నప్పుడు నాకు చెప్పులు కూడా ఉండేవి కావు. నాన్నని కొనివ్వమని అడిగితే ఆయన కొనివ్వలేదు. దాంతో నాన్నతో ఎలా అయిన చెప్పులు కొనించుకోవాలని కాల్చి పడేసిన సిగరెట్ మీద కాలేసి.. అమ్మా అని గట్టిగా అరిచాను.
అయితే అప్పుడు మా నాన్న చెప్పులు కొనివ్వకుండా చూసుకొని నడవవా అంటూ తిట్టిపోసారని చెప్పుకొచ్చాడు. ఇక తను ఏవైన తప్పు పనులు చేస్తే చెట్టుకి కట్టి నాన్న కొట్టేవారని తనికెళ్ల భరణి అన్నాడు. ఇక అప్పుడప్పుడు ఆయన జేబు నుండి రూపాయి రెండు రూపాయిలు కొట్టేస్తూ ఉండేవాడిని. కాని ఒకరోజు వంద రూపాయలు తీసుకున్నాను.
ఆ విషయం తెలుసుకున్న మా నాన్న.. వాడికి వాడికి పప్పు, నెయ్యి వేసి మంచి భోజనం పెట్టు. వాడికి మన ఇంట్లో ఇదే చివరి భోజనం. రేపటి నుండి జైల్లో తినాల్సి ఉంటుంది అని చెప్పి బాగా కొట్టేవారు. ఇక అప్పట్లో నాకు సిగరెట్ అలవాటు ఉండేది. గంజాయి కూడా అలవాటు అయింది.
ఎందుకో చాలా వ్యసనాల బారిన పడ్డాను. అయితే సిగరెట్ మానేసిన మా నాన్న ఒక రోజు నా జేబులో ఉన్న సిగరెట్ తీసుకుని తాగాడు. అయితే వ్యసనాల బారిన పడడంతో నాన్న నన్ను చాలా కొట్టి తర్వాత మనసులో చాలా ఫీలయ్యేవారు అంటూ తన తండ్రిని తలచుకొని చాలా ఎమోషనల్ అయ్యారు తనికెళ్ల భరణి.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram