AP | బాబుతో నేను.. టీడీపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమం

AP జిల్లాల్లో ధర్నాలు.. ఆందోళనలు.. హౌస్ అరెస్టులు విధాత‌: చంద్రబాబు అరెస్ట్ టీడీపీ శ్రేణులను హతాశులను చేసింది. ఏమి జరిగిందో తెలుసుకునేందుకు.. తేరుకునేందుకు రెండు రోజులు పట్టింది. ఇక ఆయన్ను సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచాలన్న వకీల్ వాదనను కోర్టు తిరస్కరించింది. రాజమండ్రి జైలు కన్నా భద్రమైన ప్రదేశము ఇంకోటి లేదని.. అయన భద్రతకు వచ్చిన ముప్పులేదన్న సీఐడీ వాదనతో ఏకీభవించిన కోర్టు ఆయన్ను జైలుకే పరిమితం చేసింది. ఇక ఏకంగా ఆ కేసునే […]

  • Publish Date - September 13, 2023 / 11:24 AM IST

AP

  • జిల్లాల్లో ధర్నాలు.. ఆందోళనలు.. హౌస్ అరెస్టులు

విధాత‌: చంద్రబాబు అరెస్ట్ టీడీపీ శ్రేణులను హతాశులను చేసింది. ఏమి జరిగిందో తెలుసుకునేందుకు.. తేరుకునేందుకు రెండు రోజులు పట్టింది. ఇక ఆయన్ను సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచాలన్న వకీల్ వాదనను కోర్టు తిరస్కరించింది.

రాజమండ్రి జైలు కన్నా భద్రమైన ప్రదేశము ఇంకోటి లేదని.. అయన భద్రతకు వచ్చిన ముప్పులేదన్న సీఐడీ వాదనతో ఏకీభవించిన కోర్టు ఆయన్ను జైలుకే పరిమితం చేసింది. ఇక ఏకంగా ఆ కేసునే కొట్టేయాలంటూ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేస్తూ ఆ కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా అరెస్ట్ దెబ్బతో పూర్తిగా దిగాలు పడిన టిడిపి క్యాడర్ కోసం నిన్న బాలకృష్ణ మాట్లాడుతూ డోంట్ వర్రీ.. నేను వస్తున్నాను అన్నారు.. అయన వచ్చేది నిజమో కాదో కానీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు.. నేను కూడా చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నాను అంటూ ఒక క్యాంపెయిన్ నడుపుతున్నారు. సోషల్ మీడియాతో బాటు జిల్లాల్లో ఆందోళనలు.. సభలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అమాయకుడు.. కక్షగట్టి అరెస్ట్ చేసారు అంటున్నారు.

ఈ సందర్భంగా ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తూ పార్టీని, పార్టీ క్యాడర్ ను ఉత్సాహంగా ఉంచడం.. నిస్తేజంలోంచి మేల్కొలిపి మళ్ళీ జగన్ ప్రభుత్వం మీద పోరాడేందుకు ఉత్సాహం నింపడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. ఇదిలా ఉండగా ఈ సభలకు వెళ్లే నాయకులను సైతం ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది .. హౌస్ అరెస్ట్ చేస్తోంది.

మరోవైపు చంద్రబాబుకు ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలీని పరిస్థితి.. ఈ క్రమంలో అయన లేకున్నా పార్టీని ప్రజల్లో సజీవంగా ఉంచడం.. ఎక్కడికక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను విస్తృతం చేయడం.. ప్రజల్లో సానుభూతి పొందడం అనే ఎజెండాతో కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు.