ఎన్నికల వేళ నగదు పట్టివేత
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి అనిరుధ్ రెడ్డి వర్గీయులకు సంబంధించిన 2 కోట్లు నగదును రాయదుర్గంలో మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు

విధాత : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి అనిరుధ్ రెడ్డి వర్గీయులకు సంబంధించిన 2 కోట్లు నగదును రాయదుర్గంలో మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదును వారు ఎక్కడి నుంచి ఎవరి కోసం ఎందుకు తీసుకెలుతున్నారన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లోని ఓ కారులో రూ.18 లక్షల ను ముషీరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గాంధీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో డబ్బులు పంచుతున్నట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు దాడి చేసి డబ్బును పట్టుకున్నారు. కారు యజమాని అందుబాటులో లేకపోవడంతో కారు అద్దాలు పగలగొట్టి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పేటీఎం స్కానర్, రెండు సెల్‌ఫోన్లు కూడా ఉన్నాయి. ఆ డబ్బులు ఎవరెవరికి ఇయ్యాలో కూడా రాసి ఉంది. కేసును ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్ దర్యాప్తు చేస్తున్నారు.