వాహనదారులకు అలెర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..!

హైదరాబాద్‌ : ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని సిటీ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు పేర్కొన్నారు. ఆయా సమయాల్లో వాహనాలను నిలిపివేయడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించేందుకు చర్యలు […]

వాహనదారులకు అలెర్ట్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు..!

హైదరాబాద్‌ : ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని సిటీ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు పేర్కొన్నారు.

ఆయా సమయాల్లో వాహనాలను నిలిపివేయడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. తెలుగుతల్లి- ఇక్బాల్‌ మినార్‌ – రవీంద్రభారతి- వీవీ విగ్రహం- షాదన్‌కళాశాల- నిరంకారి- సైఫాబాద్‌ పాతపోలీస్‌స్టేషన్‌- మాసబ్‌ట్యాంక్‌- పీటీఐ బిల్డింగ్‌ – అయోధ్య, నిరంకారి-న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌- బషీర్‌బాగ్‌ జంక్షన్‌ టు ఓల్డ్‌ పీసీఆర్‌ జంక్షన్‌, బీజేఆర్‌ విగ్రహం- ఏఆర్‌ పెట్రోల్‌పంప్‌- నాంపల్లి రైల్వేస్టేషన్‌- ఎంజేమార్కెట్‌- తాజ్‌ ఐలాండ్‌- బీఆర్‌కే భవన్‌- ఆదర్శ్‌నగర్‌- ఓల్డ్‌ పీసీఆర్‌ జంక్షన్‌- మినిస్టర్స్‌ రెసిడెన్సీ కాంప్లెక్స్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌12- విరంచి హాస్పిటల్‌- మాసబ్‌ట్యాంక్‌ వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

అలాగే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు-కేబీఆర్‌ పార్క్‌-ఎల్వీ ప్రసాద్‌ కంటి దవాఖాన – శ్రీనగర్‌ కాలనీ జంక్షన్‌- నిమ్స్‌ – వీవీ విగ్రహం, ఈఎస్‌ఐ ఆసుపత్రి- ఎస్‌ఆర్‌నగర్‌ మెట్రోస్టేషన్‌ – అమీర్‌పేట్‌ స్టేషన్‌ – పంజాగుట్ట జంక్షన్‌ – నిమ్స్‌ – వీవీ విగ్రహం, సీటీవో జంక్షన్‌- ప్యారడైజ్‌- రాణిగంజ్‌- కర్బలా- చిల్డ్రన్‌పార్క్‌- ట్యాంక్‌బండ్‌ – అంబేడ్కర్‌ విగ్రహం – తెలుగుతల్లి – ఇక్బాల్‌మినార్‌ -రవీంద్రభారతి, ప్లాజా జంక్షన్‌ – ప్యాట్నీ- బాటా- బైబిల్‌హౌస్‌- కర్బలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని సుధీర్‌బాబు వివరించారు.