CM KCR | నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. 35 అంశాలు ఎజెండా గవర్నర్ బిల్లులపై కీలక చర్చ

CM KCR | విధాత, తెలంగాణ కేబినెట్ భేటీ రేపు సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనుంది. ఎన్నికలు సమీపిస్తుండటం.. ఆగస్టు 3వ తేది నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్న నేపధ్యంలో కేబినెట్ భేటీ ఆసక్తికరంగా మారింది. మొత్తం 35అంశాలు ఎజెండాపై మంత్రివర్గం ఈ భేటీలో చర్చించనుంది. ఇందులో ప్రధానంగా తాజా వర్షాలు, వరదలతో సంభవించిన పంట నష్టం, ఇతర శాఖల వారిగా వాటిల్లిన నష్టాలపై చర్చించి కేంద్ర సాయానికి నివేదికలు సిద్ధం చేసే విషయమై […]

  • Publish Date - July 30, 2023 / 04:49 PM IST

CM KCR |

విధాత, తెలంగాణ కేబినెట్ భేటీ రేపు సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనుంది. ఎన్నికలు సమీపిస్తుండటం.. ఆగస్టు 3వ తేది నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్న నేపధ్యంలో కేబినెట్ భేటీ ఆసక్తికరంగా మారింది. మొత్తం 35అంశాలు ఎజెండాపై మంత్రివర్గం ఈ భేటీలో చర్చించనుంది.

ఇందులో ప్రధానంగా తాజా వర్షాలు, వరదలతో సంభవించిన పంట నష్టం, ఇతర శాఖల వారిగా వాటిల్లిన నష్టాలపై చర్చించి కేంద్ర సాయానికి నివేదికలు సిద్ధం చేసే విషయమై చర్చ జరుగవచ్చని భావిస్తున్నారు. అలాగే గవర్నర్ అనుమతికి గతంలో పంపిన 11బిల్లులలో తమిళ సై నాలుగింటికి మాత్రమే ఆమోదం తెలిపి, రెండు బిల్లులను రాష్ట్రపతికి నివేదించారు. మూడింటిని తిరస్కరించి, రెండింటిపై ప్రభుత్వ వివరణ కోరారు. తిరస్కరించిన, వివరణ కోరిన ఐదు బిల్లులపై ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపై కేబినెట్ భేటీలో చర్చ జరుగనుంది.

కొత్త మున్సిపాల్టీలు, మండలాల ఏర్పాటు, మెట్రో రైలు పొడింపు, రంగారెడ్డి భూముల వేలం, నిమ్స్ ట్విన్స్ టవర్ నిర్మాణానికి అప్పు, అనాధ పిల్లల పాలసీ, మామునురు ఏయిర్ పోర్టు నిర్మాణానికి భూముల సేకరణ, హెల్త్ డిపార్ట్‌మెంట్ బిల్లు, మహబూబ్‌బాద్ హార్టీకల్చర్ కాలేజీ ఏర్పాటు , ఏయిమ్స్ నిర్మాణ బిల్లులపై కేబినెట్ చర్చించనుంది. అలాగే వర్షాకాల అసెంబ్లీ, మండల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నారు.