విధాత: డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే అంశంపై రెండో జాతీయ సెమీనార్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ సెమినార్‌కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలది కీలకపాత్ర అని అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మీడియా యాజమాన్యాలు మాకు వ్యతిరేకంగా ఉండేవి. ఉద్యమం ప్రారంభించినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు. ఏ ప్రతిభ లేకున్నా రాజకీయాల్లో రాణించవచ్చని అనుకుంటారు. కానీ ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని అన్నారు.
రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని చెప్పారు. సొంతంగా నిరూపించు కోకపోతే ఏ వారసత్వాన్నికూడా ప్రజలు భరించరని ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. నా పనితీరుతోనే సిరిసిల్లలో నా మెజారిటీని క్రమంగా పెంచుకోగలిగానని, నేను సరిగా పని చేయకపోతే సిరిసిల్ల ప్రజలు నన్నూ పక్కన పెట్టేవారని తెలిపారు.
తొలినాళ్లలో కేసీఆర్ చిత్తశుద్ధిని కూడా శంకించారరని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీని ఎదుర్కొని ఉద్యమాన్ని నడిపించామన్నారు. సరిగా మాట్లాడలేని నేతలను కూడా పత్రికలు అద్భుతంగా చిత్రీకరించాయన్నారు. యాజమాన్యాలు ఎలా ఉన్నా తెలంగాణ జర్నలిస్టులు టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని, స్టింగర్ల నుంచి డెస్క్ జర్నలిస్టుల వరకు మాకు అండగా ఉండటం వల్లనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగామన్నారు.
తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీ దాకా వచ్చి కొట్లాడారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే జర్నలిస్టుల ప్రాధాన్యాన్ని సీఎం కేసీఆర్ ఎన్నడూ తగ్గించలేదని తెలిపారు. దేశంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 19 వేల అక్రిడేషన్ జర్నలిస్టులు ఉన్నారని తెలిపారు.
Minister @KTRTRS participating in an interactive session at CII Southern Region Council meeting. https://t.co/R4UqOllMKb
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 12, 2022