మే 7 నుంచి తెలంగాణ ఎంసెట్‌…

TS EAM CET-2023 | ఇంజినీరింగ్‌ సహా పలు ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ మేరకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఉన్నత విద్యామండలి సమావేశమై మే నెలలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంట్రన్స్‌లపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల తేదీలు, ఫీజుల తేదీల వివరాలను కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి […]

  • Publish Date - February 7, 2023 / 03:43 PM IST

TS EAM CET-2023 | ఇంజినీరింగ్‌ సహా పలు ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ మేరకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ఉన్నత విద్యామండలి సమావేశమై మే నెలలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఎంట్రన్స్‌లపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల తేదీలు, ఫీజుల తేదీల వివరాలను కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, 12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష జరగనుంది. మే 18న ఎడ్‌సెట్‌, మే 20న ఈసెట్‌, మే 25న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌.. మే 26,27న ఐసెట్‌, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.