విధాత: ఇంతవరకు నందమూరి బాలకృష్ణ నటించిన పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ చిత్రాలన్నీ రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో రూపొందాయి. కానీ తాజాగా ఆయన తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఓ చిత్రం చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాల విషయానికి వస్తే బాలయ్య తదుపరి చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడి వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో మాట్లాడుతూ బాలకృష్ణ సినిమాపై ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చారు.
రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఇప్పటివరకు బాలకృష్ణ సినిమాలు అందరూ చూశారు. ఇక రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ విధ్వంసం కూడా చూశారు. అయితే నెక్స్ట్ తన సినిమాలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చూడబోతున్నారు. తెలంగాణ యాసతో బాలయ్య విధ్వంసం ఎలా ఉంటుందో చూస్తారు.
బాక్సాఫీస్ ఊచకోత తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్న నా సినిమాతో ఉంటుంది. బాలయ్య నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ యాక్షన్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా బాలయ్య బాబు నుంచి ఆయన అభిమానులు కోరుకునే విధంగా ఉంటుంది అని కచ్చితంగా చెప్పుకొచ్చారు. మొత్తానికి అనిల్ రావిపూడి తన కథను తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో రాసుకున్నాడు అని అర్థమవుతుంది.
ఈ సినిమాకి కూడా సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాసే అవకాశం ఉంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో బాలయ్య చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఫిబ్రవరి నుండి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి ఇద్దరు హీరోయిన్స్ కాజోల్, శ్రీలలను రంగంలోకి దించుతున్నారు. మొత్తానికి బాలయ్యతో తాను ఎలాంటి సినిమా చేయబోతున్నది అనిల్ రావిపూడి వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో రివీల్ చేశారు.