ఆ కుక్కలకు.. మేయర్‌ నిజమైన నాయకురాలు.. ఆమెను వాటి మధ్యే వదిలేద్దాం: RGV ట్వీట్ల దండయాత్ర

Ram Gopal Varma హైదరాబాద్ ఘటన మీద ఆర్జీవి ఖండన విధాత‌: పలు సామాజిక, రాజకీయ అంశాల మీద తరచూ స్పందించే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లో కుక్కల దాడిలో ఓ పసివాడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మీద కూడా గట్టిగా స్పందించాడు. ఏదైనా సరే.. ఎవరైనా సరే.. తాను టార్గెట్ చేసినంతనే చీల్చి చెండాడే తత్త్వం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎక్కువన్న సంగతి తెలిసిందే. pic.twitter.com/lF6G56twD0 — Ram Gopal Varma (@RGVzoomin) […]

ఆ కుక్కలకు.. మేయర్‌ నిజమైన నాయకురాలు.. ఆమెను వాటి మధ్యే వదిలేద్దాం: RGV ట్వీట్ల దండయాత్ర

Ram Gopal Varma

  • హైదరాబాద్ ఘటన మీద ఆర్జీవి ఖండన

విధాత‌: పలు సామాజిక, రాజకీయ అంశాల మీద తరచూ స్పందించే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లో కుక్కల దాడిలో ఓ పసివాడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మీద కూడా గట్టిగా స్పందించాడు. ఏదైనా సరే.. ఎవరైనా సరే.. తాను టార్గెట్ చేసినంతనే చీల్చి చెండాడే తత్త్వం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎక్కువన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన పోకస్ హైదరాబాద్ మహానగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ మీదకు మళ్లింది. వీధికుక్కల దాడితో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోవటం.. చిన్నారిపై దాడి చేసిన సందర్భంగా కుక్కలు వ్యవహరించిన తీరు ఎంతలా ఉందన్న విషయం సీసీ కెమేరా ఫుటేజ్ తో ప్రపంచానికి తెలిసింది.

ఇదే తరుణంలో.. హైదరాబాద్ మేయర్ మాట్లాడుతూ కుక్కల దాడి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. వేసవిలో కుక్కలకు ఆకలి కావటంతో దాడి చేసినట్లుగా మాట్లాడగా ఈ మాటల్ని సమాజం ఖండిస్తోంది. ఈమేరకు ఆర్జీవి కూడా వరుస ట్వీట్లతో మేయర్ మీద దాడి చేశారు. అంతేకాకుండా మేయర్‌కు సంబంధించిన ఒక పాత వీడియోను ఆయన షేర్ చేశారు.

అందులో ఇంట్లోని పెంపుడు కుక్కకు తాను తినే ఆహారాన్ని ఒక చేత్తో కుక్క నోట్లో పెట్టటం.. మరో చేత్తో ఆమె తినే సీన్ ఉంది. ఈ వీడియోను షేర్ చేసిన ఆయన.. “కుక్కల నుంచి ప్రజలకు హాని కలగకుండా ఉండాలంటే మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి నా ఆలోచన చెబుతా.

నగరంలోని అన్ని కుక్కలకు ఈ వీడియో చూపిస్తే.. వాటికి ఆకలి వేసినప్పుడల్లా చిన్నారులపై దాడి చేయకుండా మేయర్ ఇంటికి వెళతాయి” అని పంచ్ వేశారు. అక్కడితో ఆగని ఆయన.. చిన్నారిపై దాడి చేసిన దారుణ వీడియోను ఆమెకు తరచు చూపించాలి.. అప్పుడే ఆమె చెత్త సలహాలు ఇవ్వకుండా ఉంటారన్నారు.

చిన్నారిని చంపేసిన కిల్లర్ డాగ్స్ కు ఆమె నిజమైన నాయకురాలేమోనని తనకు అనిపిస్తుందన్న ఆయన.. “మేయర్ మాత్రమే కాదు. అందరూ ఆ స్థానంలో మీ పిల్లల్ని ఊహించుకోండి.

2021లో గద్వాల విజయలక్ష్మీ పెట్టిన వీడియో నేటికి (2023) భయానక పరిస్థితికి చేరింది. చిన్నారిపై దాడి చేసిన కుక్కలకు బహుశా ఆమె శిక్షణ ఇచ్చారన్న అనుమానం కలుగుతుంది. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పోలీసులు ఈ అంశంపై విచారణ చేయాలి” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

కుక్కల దాడి ఉదంతానికి బాధ్యత వహిస్తూ.. గద్వాల విజయలక్ష్మీ తన మేయర్ పదవికి రాజీనామా ఎందుకు చేయకూడదు.. తన రైడీ కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి తిండి పెట్టొచ్చు కదా?.. అలా చేస్తే అప్పుడా కుక్కలు మన పిల్లల్ని తినకుండా ఉంటాయి అంటూ దుమ్మెత్తిపోశారు.