Suryapet | కంపచెట్లలో ఆడ శిశువు
Suryapet విధాత : అమ్మ తనం మరిచి పేగు బంధాన్ని వద్దనుకున్నా ఓ తల్లి జన్మ నిచ్చిన ఆడ శిశువును కంపచెట్లలో వదిలేసి వెళ్ళింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ లో ఎస్సీ కాలనీ చర్చి పక్కన సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. అటు వైపుగా వెళ్లిన కొందరికి పసి బిడ్డ ఏడుపు వినిపించడంతో వెంటనే అక్కడి ఇరుగుపొరుగు వారికి విషయం తెలిపారు. కాగా.. అమ్మలక్కలు శిశువును వెంటనే తీసుకువచ్చి చేయాల్సిన పనులన్నీ […]

Suryapet
విధాత : అమ్మ తనం మరిచి పేగు బంధాన్ని వద్దనుకున్నా ఓ తల్లి జన్మ నిచ్చిన ఆడ శిశువును కంపచెట్లలో వదిలేసి వెళ్ళింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ లో ఎస్సీ కాలనీ చర్చి పక్కన సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. అటు వైపుగా వెళ్లిన కొందరికి పసి బిడ్డ ఏడుపు వినిపించడంతో వెంటనే అక్కడి ఇరుగుపొరుగు వారికి విషయం తెలిపారు.
కాగా.. అమ్మలక్కలు శిశువును వెంటనే తీసుకువచ్చి చేయాల్సిన పనులన్నీ చేసి ఆ బిడ్డకు కు ఒక్క తల్లి కాదు మేమందరం తల్లులమే అని నిరూపించారు. గ్రామానికి చెందిన ఆరోగ్య సిబ్బంది శిశువు ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టారు. ఆరోగ్య పరీక్షల అనంతరం శిశువును శిశు గృహకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.