విధాత: నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో ఏడు నెలల క్రితం హత్యకు గురైన వ్యక్తి మృతదేహం గురువారం వెలుగు చూసింది. త్రిపురారం మండలం లావుడ్యా తండాకు చెందిన భానోత్ రాగ్యాను అతని భార్య, సడ్డకుడు ఏడు నెలల క్రితం కిరాయి మనుషులతో హత్య చేయించారు.
మృతదేహాన్ని వలలో చుట్టి రాళ్లు కట్టి సాగర్ కాలువలో పడవేశారు. పోలీసులు అప్పట్లో మృతదేహం కోసం గాలింపు చేసినా దొరకలేదు. గురువారం చేపల వేటకు వెళ్ళిన జాలర్లకు వైజాగ్ కాలనీ సాగర్ బ్యాక్ వాటర్ లో మృతదేహం చిక్కింది. నేరడు గొమ్ము పోలీసులు అవశేషాలు స్వాధీనం చేసుకొని ఆసుపత్రికి తరలించారు.