Bhupalapalli : వేషాలపల్లిలో దారుణం.. భార్య, కూతురిని నరికిన భర్త.. ప్రాణాలతో బయటపడిన కొడుకు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లిలో బుధవారం దారుణం జరిగింది. ఏలగంటి రమణాచారి అనే వ్యక్తి తన భార్య రమాదేవి (35) , కూతురు చందన (16)ను గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపాడు. చందన ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం పరీక్షలు రాసింది. భార్య, బిడ్డను హత్య చేయడంతో స్థానికులు అతడిని చితకబాదారు. ఈ సంఘటన నుంచి కొడుకు ప్రాణాలతో బయటపడినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని దర్యాప్తు […]

  • Publish Date - March 29, 2023 / 03:10 PM IST

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లిలో బుధవారం దారుణం జరిగింది. ఏలగంటి రమణాచారి అనే వ్యక్తి తన భార్య రమాదేవి (35) , కూతురు చందన (16)ను గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపాడు.

చందన ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం పరీక్షలు రాసింది. భార్య, బిడ్డను హత్య చేయడంతో స్థానికులు అతడిని చితకబాదారు. ఈ సంఘటన నుంచి కొడుకు ప్రాణాలతో బయటపడినట్లు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ మ‌ర్డ‌ర్‌కు సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.