Manchiryala: అన్ని సమస్యలకు పరిష్కారం ఇందిరమ్మ రాజ్యంలోనే..: CLP నేత భట్టి

స్థానికేతరులకు ఉద్యోగాలు ఇచ్చార‌ని ఆవేద‌న‌ విలువైన భూములు పోగొట్టుకున్నాం.. ఉపాధి కూడా లేద‌ని ఆందోళ‌న విధాత, అదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల నియోజవర్గంలో కొన‌సాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్ర‌మార్క‌ పాదయాత్ర ఆదివారం శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియం చేరుకున్న‌ది. సింగపూర్‌లోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గ‌నుల‌ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో సింగ‌పూర్‌, తాళ్ల‌ప‌ళ్లికి చెందిన ఓపెన్ కాస్ట్ భాదితులు రుక్మ మల్లేష్, తోట కిష్టయ్య, శ్రీను, అర్థ స్వామి తదితరులు భట్టిని క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. ప్ర‌ధానంగా త‌మ‌ […]

Manchiryala: అన్ని సమస్యలకు పరిష్కారం ఇందిరమ్మ రాజ్యంలోనే..: CLP నేత భట్టి
  • స్థానికేతరులకు ఉద్యోగాలు ఇచ్చార‌ని ఆవేద‌న‌
  • విలువైన భూములు పోగొట్టుకున్నాం.. ఉపాధి కూడా లేద‌ని ఆందోళ‌న

విధాత, అదిలాబాద్ ప్రతినిధి: మంచిర్యాల నియోజవర్గంలో కొన‌సాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్ర‌మార్క‌ పాదయాత్ర ఆదివారం శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియం చేరుకున్న‌ది. సింగపూర్‌లోని ఓపెన్ కాస్ట్ బొగ్గు గ‌నుల‌ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో సింగ‌పూర్‌, తాళ్ల‌ప‌ళ్లికి చెందిన ఓపెన్ కాస్ట్ భాదితులు రుక్మ మల్లేష్, తోట కిష్టయ్య, శ్రీను, అర్థ స్వామి తదితరులు భట్టిని క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.

ప్ర‌ధానంగా త‌మ‌ గ్రామాల్లోని విలువైన భూముల‌ను, ఇండ్ల‌ను, అన్నంటిని ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ప్ర‌భుత్వం తీసేసుకుంది. మా భూముల‌ను తీసుకునే సమ‌యంలో యువ‌కుల‌కు ఉద్యోగాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇప్పుడు స్థానికుల‌కు కాకుండా.. బ‌య‌టి వాళ్ల‌కు ఉద్యోగాలు ఇస్తున్నారని ocp వల్ల విలువైన భూములు కోల్పోయినప్పటికీ మాకు న్యాయం జరగలేదని మొరపెట్టుకున్నారు. మూడు గ్రామాల్లో సుమారు 1000 మంది యువ‌కులు ఉద్యోగ, ఉపాధి లేక అవ‌స్థుల ప‌డుతున్నామ‌ని చెప్పారు.

ఇదే సింగ‌రేణి సంస్థ అండ‌ర్ గ్రౌండ్ మైనింగ్ చేసుంటే అంద‌రికీ ఉద్యోగాలు, ఉపాధి దొరికేద‌ని వారు ఆవేద‌న‌గా చెప్పారు. అక్క‌డ ఒపెన్ కాస్ట్ చేస్తున్న సంస్థ‌.. అధికార పార్టీకి చెందిన చ‌ల్లా ధ‌ర్మారెడ్డికి సంబంధించిన వ్య‌క్తుల‌ది. మైనింగ్ చేస్తున్న సీఆర్ఆర్ సంస్థ బ‌య‌టి వారికి ఉద్యోగాలు ఇవ్వడం వ‌ల్ల స్థానికులు ఉద్యోగ‌, ఉపాధి మార్గాల‌ను కోల్పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారు చెప్పిందంతా విన్న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌.. త్వ‌ర‌లోనే కాంగ్రెస్ నేతృత్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం వ‌స్తుంది.. అప్పుడు అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు సురేఖ నూకల రమేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.