ఇద్ద‌రు కొడుకుల‌ను బావిలోకి తోసి.. ఆ త‌రువాత తల్లి కూడా..

తల్లీ, ఒక కుమారుడు మృతి ఒక బాబును కాపాడిన స్థానికులు హన్మకొండ జిల్లాలో విషాదం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇద్దరు కొడుకులను బావిలోకి నెట్టి ఆ తర్వాత తల్లి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం కంఠాత్మకూర్‌లో జరిగింది. కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కారణలేమిటో పూర్తిగా తెలియ‌దు కానీ.. కుమారస్వామి భార్య తన ఇద్దరు కొడుకులను బావిలోకి తోసి తాను బావిలోకి […]

  • Publish Date - February 12, 2023 / 02:33 PM IST
  • తల్లీ, ఒక కుమారుడు మృతి
  • ఒక బాబును కాపాడిన స్థానికులు
  • హన్మకొండ జిల్లాలో విషాదం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇద్దరు కొడుకులను బావిలోకి నెట్టి ఆ తర్వాత తల్లి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం కంఠాత్మకూర్‌లో జరిగింది.

కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కారణలేమిటో పూర్తిగా తెలియ‌దు కానీ.. కుమారస్వామి భార్య తన ఇద్దరు కొడుకులను బావిలోకి తోసి తాను బావిలోకి దూకిన‌ట్టు స్థానికులు చెబుతున్నారు.

పిల్లల కేకలు విన్న చుట్టు పక్కల వారు అక్కడికి వచ్చి తమ వంతు ప్రయత్నించి ఒక బాబును కాపాడారు. ఈ ఘటనలో తల్లి, ఒక కుమారుడు మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. ఎంత‌ కష్టమొచ్చిందోగానీ.. పిల్లలను బావిలోకి నెట్టేందుకు మనసెలా వచ్చిందోనని ప‌లువురు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.