వాళ్లు.. పవన్‌ని వెన్నుపోటు పొడుస్తారు: RGV
విధాత: కేవలం పవన్ కళ్యాణ్‌ను ర్యాగింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లుంది రామ్ గోపాల్ వర్మ.. ఈ మధ్య ప్రతి నాలుగు రోజులకూ ఏదో ఒక అంశం మీద పవన్ కళ్యాణ్‌ను గిల్లుతూనే ఉన్నారు. తాజాగా నేడు ఆయనకు దేముడు కలలో కనబడి పవన్‌కు వెన్నుపోటు తప్పదని చెప్పాడట. ఈ విషయాన్ని ఆర్జీవి ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఇక అప్పటి నుంచి రామ్‌గోపాల్ వర్మ మళ్లీ పొలిటికల్ కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ […]

విధాత: కేవలం పవన్ కళ్యాణ్‌ను ర్యాగింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లుంది రామ్ గోపాల్ వర్మ.. ఈ మధ్య ప్రతి నాలుగు రోజులకూ ఏదో ఒక అంశం మీద పవన్ కళ్యాణ్‌ను గిల్లుతూనే ఉన్నారు. తాజాగా నేడు ఆయనకు దేముడు కలలో కనబడి పవన్‌కు వెన్నుపోటు తప్పదని చెప్పాడట. ఈ విషయాన్ని ఆర్జీవి ట్విట్టర్లో పోస్ట్ చేసారు.
ఇక అప్పటి నుంచి రామ్‌గోపాల్ వర్మ మళ్లీ పొలిటికల్ కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంపై వర్మ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డబ్బు కోసం తన సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తున్నాడు అంటూ వర్మ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది.
ఈ సందర్భంగా కాపులకు రిప్.. కమ్మోళ్లకు కంగ్రాచ్యులేషన్స్ అంటూ వర్మ సెటైరికల్ ట్వీట్ చేశారు. తాజాగా మళ్లీ రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘ఆనాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్, ఎన్టీఆర్ ని నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీఆర్ ని మళ్ళీ చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టే ఈసారి పవన్ కల్యాణ్ ని నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు’’ అంటూ రామ్‌గోపాల్ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘‘ప్రియమైన జనసైనికులారా దయచేసి మన లీడర్ని వెన్నుపోటు నాదెండ్ల భాస్కరరావు కొడుకు నాదెండ్ల మనోహర్ కి దూరంగా వుండమని చెప్పండి .. ఇంతకు ముందు పవనిజం బుక్ రాసిన రాజు రవితేజ గురించి ఇలాగే వార్నింగ్ ఇచ్చాను. నా మాటే నిజమైంది. జై జనసేన’’ అంటూ వర్మ తన ట్వీటులో పేర్కొన్నారు. ఈయన పోస్ట్ ఇప్పుడు మళ్లి పెను దుమారం లేపుతోంది.