Rahul Gandhi | నితీశ్‌, తేజస్విలతో.. రాహుల్‌గాంధీ భేటీ! ఈ ఐక్యతను మరింత ముందుకు తీసుకెళ్తాం

ప్రతిపక్షాల ఐక్యతలో ఇది చరిత్రాత్మక అడుగు నితీశ్‌, తేజస్విలతో రాహుల్‌ భేటీపై కాంగ్రెస్‌ విధాత: రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నాల్లో, మోదీ నాయకత్వంలోని బీజపీ ప్రభుత్వాన్ని సవాలు చేయడంలో చారిత్రాత్మక అడుగు పడిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అన్నారు. రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) బుధవారం న్యూఢిల్లీలోని ఖర్గే నివాసంలో బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్‌కుమార్‌ (Nitish […]

  • Publish Date - April 12, 2023 / 01:00 AM IST
  • ప్రతిపక్షాల ఐక్యతలో ఇది చరిత్రాత్మక అడుగు
  • నితీశ్‌, తేజస్విలతో రాహుల్‌ భేటీపై కాంగ్రెస్‌

విధాత: రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నాల్లో, మోదీ నాయకత్వంలోని బీజపీ ప్రభుత్వాన్ని సవాలు చేయడంలో చారిత్రాత్మక అడుగు పడిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అన్నారు. రాహుల్‌గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) బుధవారం న్యూఢిల్లీలోని ఖర్గే నివాసంలో బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ నాయకుడు నితీశ్‌కుమార్‌ (Nitish Kumar), ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ (Tejashwi Yadav) సమావేశమయ్యారు.

దేశం కోసం ఐక్యంగా నిలుస్తాం: రాహుల్‌

‘ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలో ఇదొక చరిత్రాత్మక అడుగు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లి, దేశం కోసం మేమంతా ఐక్యంగా నిలుస్తాం’ అని రాహుల్‌గాంధీ సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు. ‘ఖర్గే, నితీశ్‌పేర్కొన్నట్టు.. ఇది చాలా ముఖ్యమైన అడుగు. బీజేపీని ఓడించేందుకు ఎన్ని ప్రతిపక్ష పార్టీలు కావాలని మీరు అడగొచ్చు. ఇది ఒక ప్రక్రియ. మాతో చేరాలనుకునే వాళ్లం అందరం కలిసి ముందుకు వెళతాం. దేశం కోసం ఒక సైద్ధాంతిక యుద్ధంలో మేం ఉన్నాం. దేశంపైనా, దేశంలోని అన్ని వ్యవస్థల పైనా దాడులు జరుగుతున్నాయి.

అందుకే మేం ఐక్యంగా పోరాటం చేస్తాం’ అని రాహుల్‌ తెలిపారు. అంతకు ముందు సంయుక్త మీడియా సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, ఈ రోజు చరిత్రాత్మక సమావేశం జరిగిందని అన్నారు. అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. రానున్న ఎన్నికలను ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఐక్యంగా ఎదుర్కొనాలని నిర్ణయించామని చెప్పారు. మరిన్ని పార్టీలను కలుపుకొనేందుకు ప్రయత్నిస్తామని, ఐక్యంగా ముందుకు వెళతామని నితీశ్‌కుమార్‌ అన్నారు.

ప్రతిపక్షాలతో ఖర్గే చర్చలు

బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలపై మల్లికార్జున ఖర్గే కొంతకాలంగా పలువురు ప్రతిపక్ష నేతలను సంప్రదిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు చెందిన డీఎంకే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు చెందిన శివసేన ఇప్పటికే కాంగ్రెస్‌కు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ ఇద్దరితోనూ ఖర్గే మాట్లాడారు.

కీలక ఎన్నికల ముందు భేటీ

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తదనంతరం మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌కు ఎన్నికలు రానున్నాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్జేడీ మధ్య చర్యలు జరగడం ప్రతిపక్షాల ఐక్యతకు దోహదం చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు