Google Top searches | గూగుల్‌లో ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా వెతికింది ఏంటో తెలుసా..?

Google Top searches | ఎక్కడ ఏ చిన్న ఏ విషయం జరిగినా..? మనకు ఏ సమాచారం కావాల్సిన వచ్చినా అందరూ గూగుల్ త‌ల్లిని అడిగేస్తుంటారు. ఎవరికి ఏం కావాలన్నా ఫోన్‌ తీసి కావాల్సిన అంశాన్ని గూగుల్‌లో వెతుక్కోవడమే. 2022లో గూగుల్‌లో భారతీయులు ఎక్కువగా వెతికిన సమాచారానికి సంబంధించిన జాబితాను గూగుల్ విడుదల చేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పాక్‌ సింగర్‌ అలీ సేథి ‘పసూరి’ సాంగ్‌ గూగుల్‌ ట్రెండ్స్‌లో ముందువరుసలో నిలిచింది. ఇక భారత్‌ విషయానికి […]

Google Top searches | గూగుల్‌లో ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా వెతికింది ఏంటో తెలుసా..?

Google Top searches | ఎక్కడ ఏ చిన్న ఏ విషయం జరిగినా..? మనకు ఏ సమాచారం కావాల్సిన వచ్చినా అందరూ గూగుల్ త‌ల్లిని అడిగేస్తుంటారు. ఎవరికి ఏం కావాలన్నా ఫోన్‌ తీసి కావాల్సిన అంశాన్ని గూగుల్‌లో వెతుక్కోవడమే. 2022లో గూగుల్‌లో భారతీయులు ఎక్కువగా వెతికిన సమాచారానికి సంబంధించిన జాబితాను గూగుల్ విడుదల చేసింది.

అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పాక్‌ సింగర్‌ అలీ సేథి ‘పసూరి’ సాంగ్‌ గూగుల్‌ ట్రెండ్స్‌లో ముందువరుసలో నిలిచింది. ఇక భారత్‌ విషయానికి వస్తే గత రెండు సంవత్సరాలు కొవిడ్‌తో పాటు క్రీడలకు సంబంధించిన విషయాల గురించి సెర్చ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పిఫా వరల్డ్‌కప్‌-2022, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సంబంధించిన విషయాల గురించి ఎక్కువగా సెర్చ్‌ చేసినట్లు గూగుల్‌ తెలిపింది.

2022లో సెర్చింగ్‌ ట్రెండ్స్‌లో ఐపీఎల్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కొవిన్‌ యాప్‌, ఫిఫా వరల్డ్‌ కప్‌ రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి. మరో వైపు వ్యక్తులకు సంబంధించిన కేటగిరిలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌ రెండు, మూడు స్థానాల్లో నిలువగా. ఆ తర్వాత వ్యాపారవేత్త లలిత్‌మోదీ, నటి సుస్మిత సేన్‌ ఉన్నారు.