ఆ శునకాలు.. రూ. 2.5 కోట్లకు అధిపతులు
విధాత: కుక్కలేంటి.. కోట్లకు అధిపతులు ఏంటని అనుకుంటున్నారా? అవును మరి ఆ శునకాలు కోటిశ్వరులే. ఎందుకంటే.. కోట్ల రూపాయాల విలువ చేసే భూమి ఆ కుక్కల సొంతం. ఆ భూమిలో దాదాపు 200 కుక్కలు దర్జాగా నివసిస్తున్నాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే గుజరాత్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లాలోని కుషాకల్ గ్రామంలో ఓ 200 కుక్కలు ఉన్నాయి. ఆ శునకాలు ఆహారం కోసం తిరగనే తిరగవు. అవి ఉంటున్న ప్రదేశానికే గ్రామస్తులంతా ఆహారం […]

విధాత: కుక్కలేంటి.. కోట్లకు అధిపతులు ఏంటని అనుకుంటున్నారా? అవును మరి ఆ శునకాలు కోటిశ్వరులే. ఎందుకంటే.. కోట్ల రూపాయాల విలువ చేసే భూమి ఆ కుక్కల సొంతం. ఆ భూమిలో దాదాపు 200 కుక్కలు దర్జాగా నివసిస్తున్నాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే గుజరాత్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. గుజరాత్ రాష్ట్రం బనస్కాంత జిల్లాలోని కుషాకల్ గ్రామంలో ఓ 200 కుక్కలు ఉన్నాయి.
ఆ శునకాలు ఆహారం కోసం తిరగనే తిరగవు. అవి ఉంటున్న ప్రదేశానికే గ్రామస్తులంతా ఆహారం తీసుకొస్తారు. అదేదో సాదాసీదా తిండికాదు. మంచి రుచికరమైన భోజనాన్ని ఆ కుక్కలకు అందిస్తారు. కిచిడీ, రోటీ, పాలతో చేసిన పదార్థాలు తినిపించి వెళ్తుంటారు. గత కొన్ని వందల ఏండ్ల నుంచి గ్రామస్తులే ఆ కుక్కల ఆలనాపాలనా చూసుకుంటున్నారు. ఇంకేముందు శునకాలు కూడా ఆ గ్రామంలో దర్జాగా నివసిస్తున్నాయి.
ఈ కుక్కలకు ఎందుకంత ప్రత్యేకత
ఎందుకంటే ఈ శునకాలు 8.5 ఎకరాల అత్యంత విలువైన భూమికి ఆసాములు. గ్రామం నడిబొడ్డున ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ.2.5 కోట్ల పైమాటే. సమస్త్ గావ్ కుత్రానీ అనే కమిటీ పేరిట రిజిస్టర్ అయి ఉన్న ఈ భూమికి 12 మంది సభ్యులు సంరక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ భూమిని అమ్మే హక్కు కమిటీ సభ్యులకు ఉండదు. కేవలం అందులో కుక్కల కోసం ఏం పండించాలి, వాటికి ఎలాంటి ఆహారం అందించాలనేది నిర్ణయిస్తుంటారు.
ఈ భూమిని 300 ఏండ్ల క్రితం మొఘల్ నవాబ్ తాలిబ్ మహ్మద్ ఖాన్ కుక్కల పేరుపై రాశారు. ఆ కాలంలో ఆహారం లేక కుక్కలు ఆకలితో అలమటించడాన్ని చూసి చలించిపోయిన నవాబు ఈ భూమిని వాటి పేరుపై రిజిస్టర్ చేశారు. ఇక అప్పట్నుంచి ఆ భూమిని కేవలం కుక్కల ఆలనాపాలనా కోసమే కేటాయించారు.