ఆ ముగ్గురికి లైన్ క్లియర్.. టికెట్స్ కన్ఫామ్?
విజయనగరం జిల్లాలో చంద్రబాబు మూడురోజుల టూర్.. దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఇండికేషన్ విధాత: చాన్నాళ్ల తరువాత విజయనగరం జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఇక్కడ మూడురోజులు మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మూడు నియోజకవర్గాలకు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసినట్లే ఇండికేషన్ ఇచ్చారు. అంటే దాదాపు ఏడాది ముందే అభ్యర్థుల విషయమై క్లారిటీ ఇచ్చేశారు. నాకు టిక్కెట్.. నాకంటే నాకు అంటూ నియోజకవర్గాల్లో బిల్డప్స్ కొట్టే నాయకులకు చెక్ పెడుతూ తాను ఎవరికీ టికెట్స్ […]

- విజయనగరం జిల్లాలో చంద్రబాబు మూడురోజుల టూర్..
- దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఇండికేషన్
విధాత: చాన్నాళ్ల తరువాత విజయనగరం జిల్లాకు వచ్చిన చంద్రబాబు ఇక్కడ మూడురోజులు మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మూడు నియోజకవర్గాలకు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసినట్లే ఇండికేషన్ ఇచ్చారు. అంటే దాదాపు ఏడాది ముందే అభ్యర్థుల విషయమై క్లారిటీ ఇచ్చేశారు. నాకు టిక్కెట్.. నాకంటే నాకు అంటూ నియోజకవర్గాల్లో బిల్డప్స్ కొట్టే నాయకులకు చెక్ పెడుతూ తాను ఎవరికీ టికెట్స్ ఇవ్వబోతున్నానో చంద్రబాబు స్పష్టత ఇచ్చేశారు. ఈ విషయంలో మరి గందరగోళానికి తావు లేకుండా చేశారు.
ముందుగా రాజాం(ఎస్సీ) నియోజకవర్గానికి మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్‌కు దాదాపుగా టికెట్ కన్ఫామ్ చేసినట్లే క్యాడర్ భావిస్తున్నారు. అక్కడినుంచి మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి రేసులో ఉన్నప్పటికీ ఆమెకు బాబు టూర్లో ప్రాధాన్యం దక్కనే లేదు. అందరితో బాటు ఆమె కూడా బాబుతో ఉన్నారు తప్ప ఆమెకు ప్రత్యేక ప్రయార్టీ అయితే ఇవ్వలేదు.
దీంతో అక్కడ కొండ్రు మురళీమోహన్‌కు దాదాపు టికెట్ ఖాయం అయినట్టే భావిస్తున్నారు. బాబు బహిరంగ సభలో మాట్లాడే వ్యాన్ మీద కూడా బాబు పక్కన మురళీమోహన్ ఒక్కరే ఉన్నారు. ప్రతిభా భారతి సైతం వెనుక వరుసలో నిలబడి ఉన్నారు. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ కొట్టిన కంబాల జోగులు మళ్ళీ వైసీపీ నుంచి బరిలో ఉండొచ్చని అంటున్నారు.
ఇక బొబ్బిలిలో సైతం ప్రస్తుత ఇన్ఛార్జ్ బేబి నాయిన తన సత్తా చాటి భారీగా జన సమీకరణ చేసి చంద్రబాబు సమక్షంలో తన పట్టును నిరూపించుకున్నారు. అక్కడ్నుంచి 2019లో పోటీ చేసి ఓడిపోయిన అప్పటి మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఆనాటి ఓటమి తరువత క్యాడర్‌కు దూరం అవ్వడంతో మొత్తం బేబి నాయిన పార్టీని నడిపిస్తున్నారు. దీంతో మళ్ళీ ఆయన్ను ఈ టూర్లో ముందు పెట్టి బొబ్బిలి సభ ఇతర కార్యక్రమాలను చంద్రబాబు పూర్తి చేశారు. ఇక్కడ కూడా సుజయ్‌కు ప్రాధాన్యం లేదు. ఆయన సైతం ఇతర కార్యకర్తల మాదిరిగా వెనుకవరుసలో నిలబడక తప్పలేదు. దీంతో ఇక్కడ బేబినాయిన కు టికెట్ దక్కినట్లే అని అంటున్నారు.
చివరిగా విజయనగరం సభలో అశోక్ గజపతి రాజు ఒక్కరికే చంద్రబాబుతో బాటు రోడ్డు షో, బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. బీసీ కోటా అంటూ గళమెత్తుతున్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు సైతం ఇక్కడ ఎలాంటి ప్రధాన్యమూ లేకపోయింది. విజయనగరం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నందున టికెట్ సైతం బీసీలకే ఇవ్వాలంటూ గీత కొన్నాళ్లుగా తిరుగుబాటు చేస్తూ వస్తున్నారు. అయినా సరే చంద్రబాబు మాత్రం అశోక్ గజపతి రాజుకు అధిక ప్రాధాన్యం ఇచ్చి టికెట్ ఆయనకే ఇస్తున్నాం.. క్యాడర్ మొత్తం ఆయనకు సపోర్ట్ చేయాల్సిందే అని స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ మూడు నియోజక వర్గాలకు అభ్యర్థులు కన్ఫామ్ అయినట్లు క్యాడర్ భావిస్తోంది