విధాత: నాగార్జున సాగర్ శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఉపనయనం పూజల సందర్భంగా స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సాగర్ పైలాన్ కాలానికి చెందిన ఉప్పల చంద్రకాంత్(26), నల్గొండకు చెందిన హరి కీర్తి నాగరాజు(39), వాచస్పతి(20)లుగా పోలీసులు గుర్తించారు. గల్లంతయిన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. రెండు రోజులు గా పైలన్ కాలనీలో సాగుతున్న ఉపనయనం కార్యక్రమానికి యువకులు హాజరయ్యారు.
సాగర్ పవర్ హౌస్ వద్ద స్నానాలకు దిగిన సందర్భంగా నీటిలో కొట్టుకుపోయారు. కళ్ళముందే తమ కొడుకులు నీటిలో కొట్టుకపోవడంతో ఒడ్డునే ఉన్న తల్లిదండ్రులు, బంధువులు వారి మృతదేహాల కోసం ఎదురుచూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.